News

IND vs AUS: విశాఖ వన్డేకు వరుణుడు కరుణించేనా? రేపటి మ్యాచ్‌ సమయంలో వాతావరణం ఎలా ఉండనుందంటే? | Threat Of Rain Looming For Visakha ODI Match Between India And Australia On Sunday Telugu Cricket News


మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా- భారత్‌ జట్ల మధ్య రెండో వన్డే ఆదివారం జరగనుంది. విశాఖపట్నం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. తన బావ కునాల్ సజ్దే వివాహం కారణంగా తొలి మ్యాచ్ ఆడలేకపోయిన రోహిత్ శర్మ రెండో వన్డేలో కూడా మళ్లీ మైదానంలోకి దిగనున్నాడు.

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా- భారత్‌ జట్ల మధ్య రెండో వన్డే ఆదివారం జరగనుంది. విశాఖపట్నం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. తన బావ కునాల్ సజ్దే వివాహం కారణంగా తొలి మ్యాచ్ ఆడలేకపోయిన రోహిత్ శర్మ రెండో వన్డేలో కూడా మళ్లీ మైదానంలోకి దిగనున్నాడు. సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉన్న భారత్ రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌ని కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే విశాఖపట్నంలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. విశాఖలో ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో భారీ వర్షం పడే అవకాశం ఉందని, ఆ తర్వాత కూడా అడపాదడపా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్‌ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. దీంతో మ్యాచ్‌కు అంతరాయం తప్పకపోవచ్చని తెలిపింది. అయితే విశాఖపట్నం స్టేడియంతో అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థ ఉంది. కొంత సమయం పాటు వర్షం పడితే, మైదానాన్ని ఆరబెట్టడం ద్వారా ఆట ప్రారంభించవచ్చు. కానీ వర్షం అడపాదడపా కొనసాగితే మాత్రం మ్యాచ్‌ నిర్వహించడం కష్టమని తెలుస్తోంది.

ముంబై వేదికగా జరిగిన తొలి వన్డేలో హార్దిక్ పాండ్యా సారథ్యంలో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు మహమ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ ధాటికి 35.4 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌటైంది. ఇద్దరూ చెరో 3 వికెట్లు తీశారు. ఆతర్వాత రాహుల్‌ 75 పరుగుల ఇన్నింగ్స్‌ కారణంగా 5 వికెట్లు కోల్పోయి టీమిండియా విజయం సాధించింది. రవీంద్ర జడేజా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. తొలుత 46 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి, తర్వాత 69 బంతుల్లో అజేయంగా 45 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి



లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



Related Articles

Back to top button