News

IND vs AUS: ఇండోర్‌లో చరిత్ర సృష్టించిన జడ్డూ.. కపిల్ తర్వాత రెండవ భారతీయుడిగా రికార్డ్.. | Ind vs aus indian star bowler ravindra jadeja 2nd player completed 500 wickets and 5000 runs after kapil dev


Ravindra Jadeja: ఇండోర్‌లో జరుగుతున్న టెస్టులో రవీంద్ర జడేజా ఓ రికార్డ్ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 500 వికెట్లు, 5000 పరుగులు పూర్తి చేసిన రెండవ భారతీయుడిగా మారాడు.

Ravindra Jadeja: ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఓ రికార్డ్ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 500 వికెట్లు పూర్తి చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదు వందల వికెట్లు పూర్తి చేసి 5000 వేల పరుగులు చేసిన రెండో భారతీయ క్రికెటర్‌గా నిలిచాడు. ఈ విషయంలో అతను భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌తో సమానంగా నిలిచాడు.

ట్రావిస్ హెడ్‌ని పెవిలియన్ చేర్చి రికార్డు సృష్టించిన జడేజా..

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో రెండో ఓవర్‌ వేయడానికి రవీంద్ర జడేజా వచ్చాడు. ఈ సమయంలో, కంగారూ బ్యాటర్ ట్రావిస్ హెడ్ క్రీజులో ఉన్నాడు. జడేజా వేసిన ఆ ఓవర్ నాలుగో బంతిని హెడ్ ఆడాలనుకున్నాడు. అయితే, బంతి లైన్‌ను కోల్పోయాడు. దీంతో బంతి అతని ప్యాడ్‌కు తగిలింది. జడేజా అప్పీల్ చేయడంతో అంపైర్ ట్రావిస్ హెడ్‌ని ఔట్‌గా ప్రకటించాడు. ఈ విధంగా రవీంద్ర జడేజా తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 500వ వికెట్‌ను పూర్తి చేసుకున్నాడు.

జడేజా ఇప్పటి వరకు భారత్ తరపున 171 వన్డేలు, 64 టీ20లు, 63 టెస్టులు ఆడాడు. మరోవైపు, జడేజా అంతర్జాతీయ వికెట్ల గురించి మాట్లాడుకుంటే, అతను టెస్టుల్లో 260 వికెట్లు (ఇండోర్ టెస్టు తొలి ఇన్నింగ్స్ వరకు) తీశాడు. అదే సమయంలో వన్డే క్రికెట్‌లో 189 వికెట్లు, టీ20 ఇంటర్నేషనల్‌లో 51 వికెట్లు సాధించాడు. అంతకుముందు టీమిండియా నుంచి కపిల్ దేవ్ అంతర్జాతీయ క్రికెట్‌లో 500 వికెట్లు, 5000 పరుగులు పూర్తి చేశాడు.

ఇవి కూడా చదవండి



మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button