News

ICMR: ఇన్‌ఫ్లుఎంజా, SARS CoV2, RSVని గుర్తించడానికి కొత్త పరీక్ష కిట్‌కు ఐసీఎంఆర్‌ ఆమోదం | ICMR Nod To RT QPCR Kit KRIVIDA TRIVUS For Detection Of Influenza, SARS CoV2, Respiratory Syncytial Virus


దేశవ్యాప్తంగా ఫ్లూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రంతో పాటు రాష్ట్రాలు అప్రమత్తం అవుతున్నాయి. H1N1తో పాటు H3N2 ఇన్‌ఫ్లుయెంజా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి..

దేశవ్యాప్తంగా ఫ్లూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రంతో పాటు రాష్ట్రాలు అప్రమత్తం అవుతున్నాయి. H1N1తో పాటు H3N2 ఇన్‌ఫ్లుయెంజా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే.. చెన్నైకి చెందిన క్రియా మెడికల్ టెక్నాలజీస్ అభివృద్ధి చేసిన క్రివిడా త్రివస్‌కు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్‌) నుంచి అనుమతి లభించింది. RT-qPCR కిట్‌తో మూడు వ్యాధికారకాలను గుర్తించవచ్చు. ఇన్‌ఫ్లుయెంజా, SARS CoV2, రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (RSV) వంటి వైరస్‌ లక్షణాలు ప్రారంభంలో ఒకే విధంగా ఉంటాయి.. తర్వాత ఈ వైరస్‌లు వ్యాపించే విధానంలో తేడాలు ఉంటాయి.

కిట్ శ్వాసకోశ అనారోగ్యానికి కారణమయ్యే వ్యాధికారకతను గుర్తించడంలో సహాయపడుతుంది. వైద్యులు, రోగులకు సరైన చికిత్సను ఎంచుకోవడానికి సహాయపడుతుంది. కిట్ 27 నిమిషాల అతి తక్కువ సమయంలోనే ఫలితాలను గుర్తించవచ్చని, ఫలితం పూర్తిగా తెలుసుకునేందుకు పట్టే సమయం 50-60 నిమిషాల మధ్య మారవచ్చు. ఇది అందుబాటులో ఉన్న అన్ని RT PCR పరికరాలలో ఉపయోగించగల ఓపెన్ కిట్. KRIVIDA TRIVUS ఇన్‌ఫ్లుఎంజా, SARS CoV2, రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్‌ల మధ్య అతి తక్కువ TAT (టర్‌నరౌండ్ టైమ్)లో ప్రభావవంతంగా వేరు చేస్తుంది. ఈ కిట్‌ ద్వారా త్వరగా చికిత్స అందించేందుకు సులభతరం అవుతుంది. ఈ కిట్‌ను పరిశీలించిన ఐసీఎంఆర్‌.. ఆమోదం తెలుపుతూ నిర్ణయించింది. పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలాజీలో 225 పాజిటివ్‌ శాంపిల్స్‌, 85 నెగటివ్‌ శాంపిల్స్‌ను ఉపయోగించి కిట్‌ను పరీక్షించారు. ఈ పరీక్షలో 99.11 శాతం, 100 శాతం ఫలితాలు వచ్చినట్లు ఐసీఎంఆర్‌ గుర్తించింది.

చెన్నైలోని ఒరగడమ్‌లోని అత్యాధునిక తయారీ కేంద్రంలో ఈ కిట్లను ఉత్పత్తి చేశారు. ఈ కిట్లను త్వరలో దేశ వ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. అయితే ఈ క్రివిడా త్రివస్‌ అందుబాటులోకి వచ్చేందుకు ఐసీఎంఆర్‌ ఆమోదంపై క్రియా మెడికల్ టెక్నాలజీస్ సీఈవో మోటూరి ఐసీఎంఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. గత కొన్ని వారాలుగా మేము H3N2 కేసుల సంఖ్య పెరుగుదలను, అలాగే దేశంలో COVID-19 ఇన్‌ఫెక్షన్ల సంఖ్య పెరుగుదలను చూశామని, ఈ ఇన్ఫెక్షన్‌ల మధ్య తేడాను స్పష్టంగా గుర్తించగల పరీక్ష ఎంతో అవసరమని, తాము ఈ పరీక్ష కిట్‌ను అభివృద్ధి చేశామని అన్నారు. శ్వాసకోశ అనారోగ్యానికి కారణమయ్యే వైరల్ వ్యాధికారక ఉనికిని గుర్తించడం ప్రాముఖ్యతను గుర్తించామని అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button