Entertainment

Filmmaker: రోజుకు 100కు పైగా సిగరెట్లు తాగుతా.. షాకింగ్ విషయం వెల్లడించిన స్టార్ డైరెక్టర్..


ఒక వ్యక్తి సాధారణంగా రోజులో ఒక సిగరెట్ ప్యాకెట్ తాగుతాడు. మహా అయితే మరొకటి వేసుకుందాం. కానీ, ఏకంగా 100 కు పైగా సిగరెట్లు తాగే వారిని ఎప్పుడైనా చూశారా? కనీసం విన్నరా? ప్రముఖ సినిమా దర్శకుడు ఒకరు..

ఒక వ్యక్తి సాధారణంగా రోజులో ఒక సిగరెట్ ప్యాకెట్ తాగుతాడు. మహా అయితే మరొకటి వేసుకుందాం. కానీ, ఏకంగా 100 కు పైగా సిగరెట్లు తాగే వారిని ఎప్పుడైనా చూశారా? కనీసం విన్నరా? ప్రముఖ సినిమా దర్శకుడు ఒకరు రోజుకు 100కు పైగానే సిగరెట్లు తాగేస్తారట. అవునండీ.. మీరు చదివేది నిజంగా నిజం. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఆయనెవరో కాదు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. లయోలా కాలేజీ, ప్రశాంత్ హాస్పిటల్స్ సంయుక్తంగా ‘ఇలయ ఇదయం కప్పం’ అనే పేరుతో అవగాహన లఘు చిత్రాల పోటీని నిర్వహించాయి. ఈ పోటీల్లో గుండె, ఆరోగ్యానికి సంబంధించిన లఘు చిత్రాలను ప్రదర్శించారు. వాటిలో ఉత్తమ షార్ట్ ఫిల్మ్‌లను శుక్రవారం లయోలా కాలేజీలో ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తమిళ దర్శకుడు వెట్రిమారన్ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా వెట్రిమారన్‌ మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో యువత చాలా ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడుపుతున్నారని అన్నారు. అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. చాలా మందికి సరైన నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు లేవని.. తద్వారా ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. ఆరోగ్యకరమైన గుండెకు మంచి నిద్ర, మంచి ఆహారం అవసరం అని ఆయన పేర్కొన్నారు. ఆల్కాహాల్, సిగరెట్‌కు యువత బానిస అవుతోందన్నారు. అదే సమయంలో అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల కూడా గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇవన్నీ రాకుండా ఉండాలంటే.. రోజూ వ్యాయామం చేయాలని సూచించారు వెట్రిమారన్.

కాలేజీలో చదువుతున్న రోజుల్లో తాను రోజుకు 50 నుంచి 60 సిగరెట్లు తాగేవాడినని వెల్లడించిన వెట్రిమారన్.. తొలి సినిమా షూటింగ్ సమయంలో రోజుకు ఏకంగా 180 వరకు సిగరెట్లు తాగేవాడినని తెలిపారు. ఇలా విపరీతంగా సిగరెట్లు తాగడం వల్ల తాను అనారోగ్యానికి గురైనట్లు పేర్కొన్నారు. వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకున్నానని, వారి సలహా మేరకు మెల్లిగా సిగరెట్లు తాగడం మానేశానని చెప్పారు వెట్రిమారన్. అంతేకాదు.. అప్పటి నుంచి తన సినిమాల్లో మద్యపానం, ధూమపానం వంటి వాటిని చూపించకుండా ఉండేందుకు ప్రయత్నించానని చెప్పారు.

వెట్రిమారన్ దర్శకత్వంలో విడుతలై సినిమా రానుంది. తమిళ స్టార్ సూరి ప్రధాన పాత్రలో, విజయ్ సేతుపతి అతిథి పాత్రలో నటిస్తున్న ఈ సినిమా రెండు పార్ట్స్‌గా విడుదల కానుందని కోలివుడ్ టాక్. భవానీ శ్రీ, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, రాజీవ్ మీనన్, చేతన్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించనున్నారు. వేల్‌రాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న విడుతలై చిత్రానికి మాస్ట్రో ఇసైజ్ఞాని సంగీతం అందిస్తున్నారు. స్టార్ హీరో సూర్యతో కూడా వెట్రిమారన్ సినిమా చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

Director Vetrimaaran

Director Vetrimaaran

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Advertisement

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Articles

Back to top button