News
hyper aadi, Jr NTR: 70 ఏళ్ల వయసొచ్చాక తనే సీనియర్ ఎన్టీఆర్: హైపర్ ఆది – hyper aadi great words about jr ntr at dhamki pre release event
‘నందమూరి తారక రామారావు గారు. ఆ పేరు పెట్టుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. నిలబెట్టుకోవాలంటే ఇంకా ధైర్యం కావాలి. కానీ దాన్ని నిలబెట్టి, తొడగొట్టి దటీజ్ ఎన్టీఆర్ అని ప్రూవ్ చేశారు ఎన్టీఆర్. వచ్చిన కొత్తల్లో తాతకు మనవడు అన్నారు. ‘ఆది’ సినిమా రిలీజయ్యాక తాతకు తగ్గ మనవడు అన్నారు. ఆ సినిమా నుంచి ఇప్పుడు RRR సినిమా వరకు తాతే మనవడి రూపంలో పుట్టాడని అంటున్నారు. అతను ఇప్పుడు యంగ్ కాబట్టి జూనియర్ ఎన్టీఆర్, కానీ ఓ 70 ఏళ్లు వచ్చాక ఆయనే మనకు సీనియర్ ఎన్టీఆర్ (Senior NTR). డైరెక్టర్ యాక్షన్ చెప్పిన తర్వాత కట్ చెప్పడం మర్చిపోయి అలానే చూస్తుండిపోయే నటన ఆయనకు మాత్రమే సొంతం. ముఖంతోనో, మాటతోనో ఎక్స్‌ప్రెషన్ పలికించడం పెద్ద విషయం కాదు. కానీ కళ్లతో కూడా ప్రతి ఎక్స్‌ప్రెషన్ పలికించగల నటుడు ఎన్టీఆర్. ఇక కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఒకరికొకరు అండగా నిలబడే విషయం ప్రతి అన్నదమ్ములకు ఆదర్శం’ అని తారక్ గురించి గొప్పగా చెప్పుకొచ్చిన ఆది.. RRR మూవీ ఆస్కార్ పొందడం గురించి కూడా మాట్లాడాడు.
‘బేసిక్‌గా ఎన్టీఆర్, రామ్ చరణ్.. అభిమానుల మీసం తిప్పే సినిమాలు ఎన్నో తీశారు. కానీ ఇప్పుడు రాజమౌళి గారి దర్శకత్వంలో దేశం మీసం తిప్పే RRR లాంటి సినిమా తీశారు. RRR లాంటి సినిమా చూసి జేమ్స్ కామెరూనే రాజమౌళి గారికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ సినిమా ద్వారా తెలుగోడి పవర్‌ను తెల్లోళ్లకి, ఇండియాలో ఉంటున్న కొంతమంది కుళ్లోళ్లకి చూపించారు రాజమౌళి. ఆస్కార్ కొట్టినందుకు ఇండియాలోని కొంతమంది ఏడుస్తున్నారు. అలాంటి వాళ్లు మన దగ్గర ఉండటం మన దురదృష్టం. ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి వంటి వారు మన ఇండస్ట్రీలో ఉండటం మనందరి అదృష్టం’ అని ముగించాడు ఆది.
ఇక ఎన్టీఆర్ గురించి మాట్లాడే ముందు.. ‘ధమ్కీ’ హీరో విశ్వక్ సేన్ యాటిట్యూడ్‌పై ప్రశంసలు కురిపించాడు. తనకు నచ్చితే గుండెల్లో పెట్టుకుంటాడని.. నచ్చకపోతే మాత్రం ఎవరినైనా బయటకు నెడతాడని చెప్పుకొచ్చాడు. తను బాలకృష్ణ లాగే భోలా మనిషని.. అందుకే అందరికీ కనెక్ట్ అయ్యాడని తెలిపారు. అలాగే మార్చి 22న విడుదలవుతున్న ‘ధమ్కీ’ చిత్రాన్ని ఆదరించాలని అభిమానులను కోరాడు.
కాగా.. వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్‌పై విశ్వక్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రాన్ని ఆయన తండ్రి కరాటే రాజు నిర్మించారు. రైటర్ ప్రసన్న కుమార్ కథ, మాటలు అందించగా.. లియోన్ జేమ్స్ స్వరాలు సమకూర్చారు.
- Read latest Tollywood updates and Telugu News