News
hyderabad tolet board fraud, టూ లెట్ బోర్డు కనిపిస్తే అంతే సగంతి.. హైదరాబాద్‌లో కొత్త తరహా మోసం ! – tolet board fraud in hyderabad old city
పాతబస్తీ హుస్సేనీ ఆలం ఇన్స్పెక్టర్ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం… యాకుత్పురాకు చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ మొహమ్మద్ అబ్దుల్ ఖుద్రూస్ (32) అనే వ్యక్తి ఎంబీఏ వరకు చదువుతున్నాడు. సులభంగా డబ్బులు సంపాదించేందుకు స్కెచ్ వేశాడు. నగరంలోని కామాటిపురా, ఫలక్నుమా, రెయిన్ బజార్ పోలీస్స్టేషన్ పరిధిలలో టూ లెట్ బోర్డులు పెట్టే వాణిజ్య సముదాయాలను టార్గెట్ చేసుకున్నాడు. సదరు షాప్ యజమానులతో మాట్లాడి.., బ్యాంకులకు సంబంధించిన ఏటీఎం సెంటర్ పెట్టిస్తానని..తద్వారా నెలకు రూ.30 వేల వరకు సమయానికి అద్దె వస్తుందని మాయమాటలు చెబుతాడు.
అతని మాటలు నిజమని నమ్మిన యజమాని ఓకే అనగానే కొలతలు తీసుకుందామని, కొలతలు తీసుకున్నట్లు నటిస్తాడు. ఏవో రెండు అగ్రిమెంట్ కాగితాలు చూపించి.. ముందుగా మీరు రూ. 20 వేలు చెల్లించాల్సి ఉంటుందని చెబుతాడు. బ్యాంకు వాళ్లు ఏటీఎం పెట్టగానే.. మీ డబ్బు రీఫండ్ అవుతుందని నమ్మిస్తాడు. ఇలా పలువురి వద్ద నుంచి డబ్బు వసూలు చేసి కంటికి కనిపించకుండా పరారైపోతాడు. హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్ పరిధిలోని కోకాబజార్కు చెందిన మీర్జా ఆలీబేగ్ (50) వద్ద కూడా ఖుద్రూస్ డబ్బులు వసూలు చేశాడు. అనంతరం కనిపించకుండా పోయాడు.
తాను మోసపోయానని ఆలస్యంగా గ్రహించిన మీర్జా ఆలీ బేగ్ పోలీసులను ఆశ్రయించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అబ్దుల్ ఖుద్రూస్‌పై ఐపీసీ 419,420 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
- Read More Telangana News And Telugu News