News

Hyderabad Si Video,Panjagutta: లేడీ ఎస్సై లవ్ మ్యారేజ్.. ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో వైరల్, మామూలుగా లేదుగా! – panjagutta lady si bhavana and ar si ravuri kishore pre wedding song gone viral in social media


దేశంలోనే నెంబర్ వన్ పోలీస్ స్టేషన్ అంటూ అవార్డు పొందిన పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పని చేస్తున్న భావన. ఏఆర్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు రావూరి కిషోర్. ఒకే వృత్తిలో ఉన్న ఆ ఇద్దరి మనసులు.. ఒకానొక క్షణంలో కలిశాయి. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఈ విషయాన్ని ఇరు కుటుంబాల్లో చెప్పి.. ఖాకీ డ్రెస్సుల్లో మొదలైన వాళ్ల ప్రేమను.. పసుపు బట్టలు కట్టుకుని పెళ్లి పీటల వరకు తీసుకొచ్చారు. ఆగస్టు 26న ఇద్దరికీ ఘనంగా వివాహం జరిగింది. అయితే.. ఇప్పుడెందుకు ఈ ముచ్చటా అనుకుంటున్నారా.. అయితే వాళ్ల పెళ్లికి ముందు ఈ పోలీసు ప్రేమ జంట.. ఇప్పటి ట్రెండ్‌ను ఫాలో అవుతూ.. ప్రీ వెడ్డింగ్ షూట్ చేపించుకున్నారు. ఇందులో భాగంగా.. ఓ సాంగ్‌ను షూట్ చేశారు. ఆ సాంగ్.. మామూలుగా లేదు మరీ.. సినిమా రేంజ్‌లో ఉంది. కపుల్స్ ఇద్దరూ.. డ్యాన్సులతో అదరగొట్టారు. కాగా.. ఇప్పుడది.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారి.. తీవ్ర దుమారం రేపుతోంది.

వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకున్నారు.. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకున్నారు. అందులో డ్యాన్సులు చేశారు. ఇదంతా వాళ్ల పర్సనల్.. దీనికి ఆ వీడియోపై దుమారం ఎందుకు నడుస్తోంది అనేగా మీ డౌటనుమానం. అయితే.. ప్రీ వెడ్డింగ్ షూట్‌లలో చాలా థీమ్స్ పెట్టి సాంగ్స్ ప్లాన్ చేస్తుంటారు. వీళ్లింద్దరూ పోలీసులు కాబట్టి.. అందులోనూ వాళ్లది లవ్ మ్యారేజ్ కాబట్టి.. వాళ్ల ప్రేమాయణాన్ని తమ సాంగ్‌లో చూపిద్దామనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే.. సినిమా రేంజ్‌లో మొదట హీరోయిన్ ఎంట్రీ.. ఆ తర్వాత హీరో మాస్ ఎంట్రీ.. అప్పుడే వీళ్లిద్దరి మధ్య ప్రేమ.. ఆ తర్వాత మాంచి పీల్ గుడ్ లవ్ సాంగ్‌లో డ్యాన్స్ ఎక్సెట్రా.. ఈ కాస్పెప్ట్‌తో సాంగ్ ప్లాన్ చేశారు.

ఇంత వరకు అంతా బాగానే ఉంది కానీ.. వీళ్ల పర్సనల్ ప్రీ వెడ్డింగ్ సాంగ్ కోసం.. అటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను.. దాంతో పాటు పోలీస్ వాహనాలను.. వాడుకున్నారు ఈ పోలీస్ ప్రేమ జంట. అయితే.. పెళ్లి జరిగిన ఇన్ని రోజులకు ఆ ప్రీ వెడ్డింగ్ సాంగ్.. సోషల్ మీడియాలో పోస్టు చేయటంతో.. అది కాస్త వైరలై దుమారం రేపుతోంది. పోలీస్ కపుల్స్.. తమ ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం.. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. సదరు ఎస్సైల మీద చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. మరి.. పోలీస్ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి మరి.

మరో కాళేశ్వరం.. పాల‌మూరు- రంగారెడ్డి ఎత్తిపోత‌ల‌ ప్రాజెక్టు ప్రారంభం

Related Articles

Back to top button