News

hyderabad rains today, హైదరాబాద్‌లో భారీ వర్షం.. పలు చోట్ల వడగండ్లు.. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి – heavy rain in hyderabad and hail in many places


హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో.. సికింద్రాబాద్‌లోని అల్వాల్, బొల్లారం, తిరుమలగిరి పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు, రామచంద్రపురం, అమీన్‌పూర్, జిన్నారం, గుమ్మడిదల, రామచంద్రాపురం, బీహెచ్‌ఈఎల్, తెల్లాపూర్ పరిసర ప్రాంతాలలో వడగండ్ల వాన పడింది. బానూరు, నందిగామ, ముత్తంగిలోనూ వడగండ్లు కురిశాయి. శేరిలింగంపల్లిలోని చందానగర్, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ పరిసర ప్రాంతాల్లో కూడా వడగండ్ల వాన పడింది.

భారీ వర్షం కారణంగా.. నగరంలోని రోడ్లు మొత్త జలమయమయ్యాయి. రోడ్లపై వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావటంతో.. రాకపోకలకు ఇబ్బంది తలెత్తుతోంది. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా వడగళ్ల వాన పడుతోంది. అకాల వర్షం కారణంగా జనం ఇబ్బందులు పడుతున్నారు. అయితే.. మరో రెండు రోజుల పాటు అటు హైదరాబాద్‌తో పాటు ఇటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అవసరం ఉంటే తప్ప బయటకి రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

Rain Alert: అవసరమైతేనే బయటకు రండి.. భారీ వర్ష సూచన

  • Read More Telangana News And Telugu News

Related Articles

Back to top button