News

hyderabad car accident, కారు ముందు ఆడుకుంటున్న చిన్నారి.. చూసుకోకుండా ముందుకుపోనిచ్చి, దారుణం – child run over by car as driver move vehicle without noticing him in hyderabad banjara hills


ముందూ వెనుకా చూసుకోకుండా కారును నడిపి ఓ చిన్నారి మీద నుంచి వాహనాన్ని ముందుకు తీశాడు. హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో వెలుగులోకి వచ్చింది. బాలుడు ఆడుకుంటూ రోడ్డు మీదకు వచ్చాడు. అదే సమయంలో ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కారులో ఉన్న ఓ వ్యక్తి, వాహనాన్ని స్టార్ట్ చేసి ముందుకుపోనిచ్చాడు. కారు బానెట్ ముందు భాగంలో ఆడుకుంటున్న బాలుడి పైకి ఎక్కించి, అతడి మీద నుంచి అలాగే వెళ్లిపోయాడు. వాహనం కుదుపులకు లోనైనా ఆపకుండా ముందుకు వెళ్లిపోయాడు.

బాలుడి ఆర్తనాదాలు విని అక్కడే ఉన్న ఓ మహిళ పరుగెత్తుకొచ్చింది. తీవ్ర గాయాలతో రోదిస్తున్న బాలుడిని ఎత్తుకొని, ఏం చేయాలో పాలుపోక అక్కడి ఇళ్ల ముందు అటూ ఇటూ పరుగెత్తుతున్న దృశ్యాలు సీసీటీవీ వీడియోలో కనిపిస్తున్నాయి.

ఈ ఘటనలో 19 నెలల వయస్సు గల చిన్నారి హసీబ్.. తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకొని, వాటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

చూసుకోకుండా కారును ముందుకు పోనిచ్చిన డ్రైవర్

కబడ్డీ ఆడుతూ కుప్పకూలి.. ‘గుండెపోటు’తో విద్యార్థి మృతి

Related Articles

Back to top button