Hyderabad: హైదరాబాద్‌లో ఇంటెలిజెన్స్ ఆపరేషన్.. ఉగ్ర కుట్ర కేసులో మరో ఇద్దరు అరెస్ట్.. – Telugu News | Two more arrested by ATS police in terror case at Hyderabad
ఉగ్ర కార్యాకలాపాలకు అడ్డగా మారుతున్న హైదరాబాద్‌లో మరో ఇద్దరు టెర్రరిస్టు సానుభూతిపరులు అరెస్టయ్యారు. ఏటీఎస్, కౌంటర్ ఇంటెలిజెన్స్ జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా బాబానగర్, చాంద్రాయణగుట్టలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
ఉగ్ర కార్యాకలాపాలకు అడ్డగా మారుతున్న హైదరాబాద్‌లో మరో ఇద్దరు టెర్రరిస్టు సానుభూతిపరులు అరెస్టయ్యారు. ఏటీఎస్, కౌంటర్ ఇంటెలిజెన్స్ జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా బాబానగర్, చాంద్రాయణగుట్టలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు H.U.T ఉగ్రవాద కార్యకలాపాలపై దర్యాఫ్తును ముమ్మరం చేసిన పోలీసులు ఇటీవల హైదరాబాద్‌లో ఆరుగురిని అరెస్ట్ చేశారు. భోపాల్‌లో 11మందిని అదుపులోకి తీసుకున్నారు. తాజా అరెస్టుతో ఈ సంఖ్య మొత్తం 19కి చేరింది.
ఉగ్రవాద కార్యకలాపాలపై అటు మధ్యప్రదేశ్ కు చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్కాడ్, ఇటు తెలంగాణకు చెందిన కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా..వారిచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్‌లోని బాబానగర్‌లో ఒకర్ని, చాంద్రాయణ గుట్టలో మరొకరిని కస్టడీలోకి తీసుకున్నారు. మహారాష్ట్ర ఏటీఎస్, తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ఈ జాయింట్ ఆపరేషన్ చేశారు.
అరెస్ట్ అయిన ఈ 19మంది కూడా ఉగ్రవాద సానుభూతిపరులుగా గుర్తించారు. కొంతకాలంగా హైదరాబాద్‌ను అడ్డగా మార్చుకొని ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. వీరంతా భోపాల్, హైదరాబాద్ మధ్యలో ఉన్న అనంతగిరి అడవుల్లో ఉగ్రవాద శిక్షణ తీసుకుంటున్నారు. మొత్తంగా ఈ కేసులో ఇప్పటివరకు హైదరాబాద్‌కు చెందిన వారు 8మంది అరెస్ట్ అయ్యారు. వీరే కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు స్పీడప్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..