News

Hyderabad: ‘డెత్ గేమ్’లో బిగ్ ట్విస్ట్.. ప్రియురాలి భారీ స్కెచ్.. రెండో ప్రియుడితో కలిసి మొదటి ప్రియుడిని..


Triangle Love Story

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో క్రైమ్‌కి దారితీసిన ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇది. ఓ యువతి.. తన మొదటి ప్రియుడ్ని, రెండో ప్రియుడితో కలిసి భవనంపై నుంచి తోసేసి హత్యాయత్నం చేసింది. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన భాగ్యనగరంలో పెను సంచలనం సృష్టిస్తోంది. సినిమాలు, సీరియల్స్‌లో చిన్నాచితకా క్యారెక్టర్లు చేసుకునే నాగవర్థిని, సూర్యనారాయణ ఒకప్పడు ప్రేమికులు. ఇద్దరూ కృష్ణానగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో సహజీవనం కూడా చేస్తున్నారు. ఒకరోజు సూర్యనారాయణ తన స్నేహితుడు శ్రీనివాస్‌ రెడ్డిని నాగవర్థినికి పరిచయం చేశాడు. ఆ తర్వాత ఏమైందో ఏమో.. నాలుగునెలలుగా సూర్యనారాయణకు దూరంగా, శ్రీనివాసరెడ్డికి దగ్గరగా మసలుతోందామె. ఈ బ్రేకప్‌ తర్వాత శ్రీనివాస్‌, నాగవర్థిని కలిసి అదే ఇంట్లో సహజీవనం చేస్తూ వచ్చారు.

సూర్యనారాయణ అదే బిల్డింగ్‌లోని పై ఫ్లోర్‌కి మారాడు. తాజాగా సూర్యనారాణకు, ఈ జంటకు మధ్య వివాదం తలెత్తింది. ఆ వివాదం కాస్తా ముదిరి.. ఆ జంట ఇద్దరూ కలిసి సూర్యనారాయణనను బిల్డింగ్ పైనుంచి తోసేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీలో అసలు వివాదం ఎందుకొచ్చిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Related Articles

Back to top button