Entertainment

Hunt Movie : చిక్కుల్లో సుధీర్ బాబు సినిమా.. ముదురుతున్న హంట్ మూవీ టైటిల్ వివాదం


Hunt

యంగ్ హీరో సుధీర్ బాబు లేటెస్ట్ మూవీ పై వివాదం కొనసాగుతోంది. తాజాగా ఈ యంగ్ హీరో నటిస్తోన్న సినిమాకు హంట్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్నసినిమా ‘హంట్’. మహేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే హంట్ టైటిల్ పై వివాదం రేగింది. ఈ టైటిల్ మాది అంటున్నారు డైరెక్టర్ , హీరో నిక్షిత్. దీనిపై వివాదం కొనసాగుతోంది. హంట్ మూవీ టైటిల్ మాది అంటూ ఇటు శ్రీ క్రియేషన్స్, అటు భవ్య క్రియేషన్స్ వాదనలు వినిపిస్తున్నప్పటి , భవ్య క్రియేషన్స్ వారికి టైటిల్ ఆమోదం చేసిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కి వ్యతిరేకంగా నిరసన వ్యక్తపరుస్తూ హంట్ సినిమా టీం వినతి పత్రాన్ని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ట్రెజరర్ తుమ్మలపల్లి రామసత్యనారాయణ కి అందచేశారు.

హీరో డైరెక్టర్ నిక్షిత్ మాట్లాడుతూ “మాకు న్యాయం జరగాలి అని లీగల్ గా నోటీసులు సైతం పంపించాము, కౌన్సిల్ నుంచి, భవ్య క్రియేషన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఈ రోజు మేము నిరసన వ్యక్తం చేయాల్సి వచ్చింది,
మా టైటిల్ మాకు వచ్చే వరకు న్యాయ పరమైన పోరాటం చేస్తాం, నిరాహార దీక్ష కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం” అని తెలిపారు.

 

నిర్మాతల మండలి ట్రెజరర్ తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ “వినతిపత్రం చూసాను, ఏ నిర్మాతకు అన్యాయం జరగకూడదు అనేది మా ఆశయం. ఒకే టైటిల్ ఇద్దరి నిర్మాతలకు ఇవ్వడం మాత్రం తప్పే.. తప్పు ఎక్కడ జరిగింది అనే అంశంపై మా ఈసీ మెంబర్ కమిటీ సభ్యులు అభిప్రాయాలు తీసుకొని ఈ సమస్యకి సొల్యూషన్ దొరుకుతుంది” అని తెలిపారు. మరి దీని పై సుధీర్ బాబు మూవీ టీమ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Related Articles

Back to top button