News

Hoysala Temples,UNESCO: “హోయసల”కు యునెస్కో గుర్తింపు.. ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో మరో భారత అద్భుతం – unesco approves hoysala temples of karnataka as new world heritage sites


UNESCO: కర్ణాటకలోని హోయసల ఆలయం ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలోకి చేరింది. ఈ విషయాన్ని స్వయంగా ది యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ – యునెస్కో తాజాగా సోమవారం వెల్లడించింది. అయితే పశ్చిమ బెంగాల్‌లో ఉన్న శాంతినికేతన్‌ను కూడా ఈ ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చుతూ ఆదివారం యునెస్కో వెల్లడించింది. ఈ క్రమంలోనే రెండు రోజుల్లో రెండు భారతీయ అద్భుత కట్టడాలకు యునెస్కో గుర్తింపు దక్కడం దేశ ప్రజలకు ఎంతో గర్వకారణంగా నిలిచింది. తాజాగా హోయసలను ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలోకి చేర్చుతూ యునెస్కో తీసుకున్న నిర్ణయం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.

కర్ణాటకలో ప్రసిద్ధి చెందిన బేలూర్‌, హళేబీడ్‌, సోమనాథ్‌పుర ఆలయాలకు కలిపి ఈ అంతర్జాతీయ గుర్తింపు ఇస్తున్నట్లు యునెస్కో ప్రకటించింది. ప్రస్తుతం సౌదీ అరేబియాలో జరుగుతున్న 45వ వరల్డ్‌ హెరిటేజ్‌ కమిటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

హోయసలను ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తిస్తూ యునెస్కో తీసుకున్న నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో కర్ణాటకలోని హోయసలకు చోటు లభించడం అనేది భారతదేశానికి ఎంతో గర్వకారణమని ట్వీట్ చేశారు. ఆ ఆలయాలపై చెక్కిన సమాచారం, అద్భుతమైన శిల్పకళ భారత సాంస్కృతిక వారసత్వం, పూర్వీకుల కళానైపుణ్యానికి నిదర్శనమని ఆ ట్వీట్‌లో వెల్లడించారు. హోయసలలోని పవిత్ర ఆలయాలు 2014 ఏప్రిల్‌ 15 వ తేదీ నుంచే యునెస్కో పరిశీలన జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ హోయసల ఆలయాల పరిరక్షణ బాధ్యతలను ఆర్కియాలాజిక్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఏఎస్ఐ నిర్వర్తిస్తోంది.

అయితే ఆదివారం పశ్చిమ బెంగాల్‌లోని చారిత్రక ప్రదేశం, ప్రఖ్యాత బెంగాలీ కవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ వందేళ్లకు ముందు నిర్మించిన విశ్వ భారతి యూనివర్సిటీ ఉన్న శాంతినికేతన్‌ను యునెస్కో గుర్తించింది. ఈ శాంతినికేతన్‌ను ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చుతున్నట్లు ట్విటర్ వేదికగా ప్రకటించింది. శాంతినికేతన్‌కు యునెస్కో గుర్తింపు దక్కడంపై ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతోషం వ్యక్తం చేశారు. రాజధాని కోల్‌కతాకు సుమారు 160 కిలోమీటర్ల దూరంలోని బోల్పుర్‌ పట్టణం సమీపంలో ఉన్న శాంతినికేతన్‌.. రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి దేవేంద్రనాథ్‌ ఠాగూర్‌ 1863లో నిర్మించిన ఆశ్రమం. కులమతాలకు అతీతంగా ఎవరైనా ఇక్కడకు వచ్చి పరమాత్మ ధ్యానంలో గడిపేలా దీన్ని నిర్మించారు. 1921లో రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ అక్కడే విశ్వ భారతి విద్యాలయాన్ని ప్రారంభించారు. 1951లో కేంద్ర విశ్వవిద్యాలయ హోదా దక్కగా.. పశ్చిమ బెంగాల్‌లో ఈ హోదా పొందిన ఏకైక వర్సిటీగా నిలిచింది.

Cabinet Meeting: మోదీ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. కీలక బిల్లుకు కేబినెట్ ఆమోదం!
Bengaluru Traffic: ట్రాఫిక్‌లో కూరగాయలు తరిగిన మహిళ.. ఇలా కూడా వాడుకోవచ్చా, సూపర్ ఐడియా!
Read More Latest National News And Telugu News

Related Articles

Back to top button