News

How To Upgrade Sleeper To Ac,Sleeper Tickets: ఈ స్కీం ఏదో బాగుందే.. స్లీపర్ క్లాస్ టికెట్‌తోనే ఫ్రీగా థర్డ్ ఏసీ ప్రయాణం.. ఎలాగంటే? – irctc ticket booking here is how to upgrade from sleeper to ac


IRCTC Ticket Booking: పండగల సీజన్ వచ్చేసింది. ఇప్పుడు వినాయక చవితి మొదలుకొని.. బతుకమ్మ, దుర్గాష్టమి, దసరా, దీపావళి.. రాబోతున్నాయి. దీంతో చాలా మంది జనం తమ సొంతూళ్లకు వెళ్లాలనుకుంటుంటారు. లేకుంటే ఫ్యామిలీతో ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసుకుంటుంటారు. ఫ్రెండ్స్ వెకేషన్‌కు వెళ్తుంటారు. ఇక ఈ పండగల సమయాల్లో దూర ప్రాంతాలకు వెళ్లాలనుకుంటే రైలెక్కాల్సిందే. చాలా మంది ఇదే ఎంచుకుంటుంటారు. ముందుగా ప్లాన్ చేసుకుంటే టికెట్ ఈజీగానే దొరకొచ్చు. అయితే చివరి నిమిషంలో టికెట్ బుక్ చేసుకునేవాళ్లకు టికెట్ దొరకడం కాస్త కష్టమే.

ఈ టెన్షన్ లేకుండా ఐఆర్‌సీటీసీ పెద్ద ఉపశమనం కల్పించింది. ప్రయాణికుల కోసం ఆటో అప్‌గ్రేడేషన్ స్కీమ్ తీసుకొచ్చింది. అసలు ఈ స్కీం ఏంటి.. దీని వల్ల ఎవరికి లాభం.. నిబంధనలు ఏంటి.. వంటి వివరాలు ఇక్కడ చూద్దాం.

ఇప్పటివరకు రైలు ప్రయాణికులకు రిజర్వేషన్‌తో తాము ఎంచుకున్న కోచ్‌లోనే బెర్త్ ఉంటుంది. ఆ బోగీలో బెర్త్ లేకుంటే రిజర్వేషన్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మాత్రం అలా లేదు. ఆటో అప్‌గ్రేడేషన్ ఫీచర్ వచ్చిన తర్వాత.. ఎంచుకున్న కోచ్‌లో బెర్త్ లేకుంటే… అంతకంటే పై కోచ్‌లో సీట్ లభిస్తుంది. దీని కోసం ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే ముందే.. మీరు ఆటో అప్‌గ్రేడేషన్ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. దీనికి ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు.

PM Kisan 15th Installment: రైతులకు అదిరే శుభవార్త.. పండగ బొనాంజా.. ముందే అకౌంట్లలోకి డబ్బులు!

SBI: ఎస్‌బీఐ ఒకవైపు ఆఫర్.. ఇప్పుడు ఇంత పని చేసిందేంటి? నేటి నుంచే అమల్లోకి.. ఏం ప్రకటన చేసిందంటే?

ఉదాహరణకు చూస్తే.. ఈ ఆటో అప్‌గ్రేడేషన్ ఆప్షన్‌తో ఒక ప్యాసింజర్.. స్లీపర్ కాస్ టికెట్ బుక్ చేసుకున్నాడనుకుందాం. అప్పుడు ఆ బోగీలో బెర్త్ ఖాళీ లేకుంటే.. థర్డ్ ఏసీలో ఖాళీగా ఉన్న బెర్త్ లభించే ఛాన్స్ ఉంటుంది.
ఇది కేవలం స్లీపర్ ప్రయాణికులకు మాత్రమే కాదు.. థర్డ్ ఏసీ వారికి.. సెకండ్ ఏసీ, సెకండ్ ఏసీ ఉంటే థర్డ్ ఏసీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ బోగీల్లో సీట్లు అందుబాటులో ఉన్నప్పుడే ఇది వర్తిస్తుంది. ఆన్‌లైన్ నుంచి ఐఆర్‌సీటీసీలో ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నవారికే ఇది వర్తిస్తుందని చెప్పొచ్చు.

మహిళలకు గుడ్‌న్యూస్.. ఫ్రీగా గ్యాస్ సిలిండర్, స్టవ్‌.. సబ్సిడీ కూడా.. ఎలా అప్లై చేసుకోవాలి?

  • రెండు సార్లు బోనస్ షేర్లతో అద్భుతం.. లక్షకు రూ. 21 లక్షల లాభం.. మరో బంపర్ ఆఫర్!

Read Latest Business News and Telugu News

Advertisement

Related Articles

Back to top button