News

Horoscope Today (March 20): వారికి సంపాదనపరంగా అదృష్టం కలిసి వస్తుంది.. సోమవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? | Daily horoscope for march 20 2023 aries libra virgo and other zodiac signs check astrological prediction Telugu Astrology

TV9 Telugu Digital Desk

TV9 Telugu Digital Desk | Edited By: Janardhan Veluru

Updated on: Mar 20, 2023 | 2:00 AM

Daily Horoscope Today: తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తి ఎవరికైనా ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది విశ్వసించే విధానం జ్యోతిష్యం. 12 రాశుల వారికి శనివారం (మార్చి 18) దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. 12 రాశుల వారికి సోమవారం (మార్చి 20, 2023) దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Mar 20, 2023 | 2:00 AM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఊహించని ధన లాభం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి అవుతాయి. సుఖసంతోషాలు అనుభవానికి వస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి కనిపిస్తోంది. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు. వితరణ కార్యక్రమంలో పాల్గొంటారు. కుటుంబ పరంగా ఒక మంచి శుభవార్త వింటారు. ఇంటా బయటా ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం చాలావరకు నిలకడగా ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): కుటుంబానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పనులలో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీదపడతాయి. కొందరు బంధువుల నుంచి చికాకులు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యం జాగ్రత్త. తగినంత విశ్రాంతి అవసరం. వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. డబ్బు జాగ్రత్త.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): సంపాదనపరంగా అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో మాత్రం బాగా శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ఇంట్లో ప్రశాంతతకు, సంతోషానికి లోటు ఉండదు. కొద్ది శ్రమతో ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు మంచి ఫలితాలను ఇస్తాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఆర్థిక పరిస్థితుల్లో కొద్దిగా మెరుగుదల కనిపిస్తుంది. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. బంధు వర్గంలో పలుకుబడి పెరుగుతుంది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న పని ఒకటి విజయవంతంగా పూర్తి అవుతుంది. శుభవార్త వింటారు. నిరుద్యోగులకు మంచి కంపెనీలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి సంబంధం కుదురుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఉద్యోగంలో ఊహించని విధంగా స్థిరత్వం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. పట్టుదలతో కొన్ని పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ కొన్ని ఖర్చులు అనుకోకుండా మీదపడతాయి. స్నేహితులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు.

Advertisement
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఆర్థిక పరిస్థితి చాలావరకు నిలకడగా ఉంటుంది. ఎంతో ప్రయత్నం మీద కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమ బాగాపెరుగుతుంది. మీకు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. నిరుద్యోగులకు దూరప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఉద్యోగ వాతావరణం కొంతవరకు అనుకూలంగా ఉంది. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే కలిసి వస్తాయి. కుటుంబ సమస్య ఒకటి కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. ఇంటా బయటా విపరీతంగా ఒత్తిడి ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. కొద్దిగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. పిల్లలు కష్టపడాల్సి ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ): ఉద్యోగ జీవితం బాగానే ఉంటుంది. కుటుంబంలో పిల్లల విషయంలో చికాకులు తలెత్తుతాయి. వ్యాపార పరంగా కాస్తంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. సేవా కార్యక్రమాలు పాల్గొంటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. తలచిన పనులు నెరవేరుతాయి. ఆర్థిక సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో మెరుగుపడుతుంది. ఆస్తిపరంగా శుభవార్త వింటారు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. బందు వర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్నేహితుల వల్ల కొద్దిగా డబ్బు నష్టం జరగవచ్చు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ముందుకు వెళతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2): వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధికి అవకాశం ఉంది. అనుకోకుండా ఆదాయం బాగా పెరుగుతుంది. ఉద్యోగ జీవితం ఆశాజనకంగా ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టండి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. కొన్ని బాధ్యతలను సమర్ధవంతంగా పూర్తి చేస్తారు. శుభవార్త వింటారు. పరిచయస్తులలో పెళ్లి సంబంధం కుదురుతుంది. పిల్లలకు సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పర్వాలేదు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. శక్తికి మించి కష్టపడతారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కొందరు మిత్రులకు సహాయం చేస్తారు. ఆదాయం ఒడిదుడుకులకు గురవు తుంది. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసు కుంటారు. ప్రేమ వ్యవహారాలలో ముందుకు దూసుకుపోతారు. ఆరోగ్యం పర్వాలేదు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఆదాయం, ఆరోగ్యం చాలావరకు నిలకడగా ఉంటాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. సంకల్ప బలంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఇతర సంస్థల నుంచి కొత్త ఆఫర్లు వస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Related Articles

Back to top button