News

Horoscope Today: వీరికి చంద్రబలం అనుకూలంగా ఉంది.. శుభవార్త వింటారు.. బుధవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే? | Horoscope Today in Telugu : Astrological prediction for November 23rd 2022 Eroju Rasi Phalalu


ఈ రాశులవారికి చంద్రబలం అనుకూలంగా ఉంది. చేపట్టిన పనులను త్వరగా పూర్తిచేస్తారు. అనకున్న లక్ష్యాలను చేరుకుంటారు. ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ దైవారాధన మాత్రం మానవద్దు.

మేషం

చేపట్టిన పనులు సకాలంలో పూర్తవ్వాలంటే కష్టపడక తప్పదు. ఫ్యూచర్‌కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే మేలు కలుగుతుంది.

వృషభం

ప్రారంభించిన పనులు త్వరగా పూర్తి చేయగలుగుతారు. స్థిరమైన ఆలోచనలతో ముందుకు సాగుతారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలి. మొహమాటాలతో ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే శుభం కలుగుతుంది.

మిథునం

ఆత్మవిశ్వాసం, మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ఉద్యోగంలో సానుకూల ఫలితాలు పొందుతారు. మనసుకు ఇష్టమైన వారితో కాలక్షేపం చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మొహమాటాన్ని దరిచేరనీయకండి. చంద్ర ధ్యానంతో సానుకూల ఫలితాలు పొందుతారు.

కర్కాటకం

చేపట్టిన పనుల్లో ఆటంకం కలగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆగ్రహాన్ని దరిచేరనీయకండి. ప్రయాణంలో ఆటంకాలు, అనవసర ఖర్చులు ఇబ్బంది పెడతాయి.శివారాధన చేస్తే మంచిది.

సింహం

ఈ రాశులవారికి చంద్రబలం అనుకూలంగా ఉంది. చేపట్టిన పనులను త్వరగా పూర్తిచేస్తారు. అనకున్న లక్ష్యాలను చేరుకుంటారు. ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ దైవారాధన మాత్రం మానవద్దు.

కన్య

సకాలంలో పనులను పూర్తిచేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తారు. మీ ప్రయత్నాలు, లక్ష్యాలు నెరవేరుతాయి. పెద్దల ఆశీస్సులు ఉంటాయి. గొడవలకు దూరంగా ఉండడం మంచిది. లక్ష్మీ గణపతి ఆరాధిస్తే మేలు జరుగుతుంది.

Advertisement

తుల

చేపట్టిన పనులు సకాలంలో నెరవేరుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ధన, వస్త్రలాభాలు కలవు. సూర్యనమస్కారాలతో సానుకూల ఫలితాలు పొందుతారు.

వృశ్చికం

వీరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల తోడ్పాటుతో చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. గిట్టనివాళ్లు మిమ్మల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తారు. చంద్రధ్యానంతో సానుకూల ఫలితాలు పొందుతారు.

ధనస్సు

స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సభ్యులతో గొడవలు, కలహాలు కలిగే అవకాశం ఉంది. సహచరులతో ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. అష్టలక్ష్మీస్తోత్రం పఠిస్తే మంచిది.

మకరం

ఈరాశివారికి మిశ్రమ ఫలితాలు ఉన్నారు. కొన్ని సంఘటనలు మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. లక్ష్యసాధనలో కుటుంబ సభ్యుల, ఆత్మీయుల సహకారం ఉంటుంది. గురుధ్యానంతో మంచి ఫలితాలు పొందుతారు.

కుంభం

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు. సమయస్ఫూర్తి, బుద్ధిబలంతో కీలక వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. దుర్గారాధనతో శుభం కలుగుతుంది.

మీనం

కొందరి వల్ల సమస్యలు ఎదురవుతాయి. కీలక విషయాలు, వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహాలు, సూచనలను తీసుకోవడం మంచిది. అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శివారాధనతో ఉత్తమ ఫలితాలు పొందుతారు.

ఇవి కూడా చదవండినోట్‌: రాశిఫలాలు అనేవి వ్యక్తిగత నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కొందరు నిపుణుల అభిప్రాయాలను ఇక్కడ అందించడం జరిగింది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Articles

Back to top button