News

Horoscope Today: ఈ రాశివారు ఉద్యోగరీత్యా ప్రయాణం చేయాలి.. గురువారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?


Horoscope

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కొన్ని ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. ఉద్యోగంలో సహచరుల బాధ్యతలను కూడా మీరే నిర్వర్తించడం జరుగుతుంది. తల్లిదండ్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. పెళ్లికి సంబంధించి బంధు వర్గం నుంచి శుభవార్త అందుతుంది.

వృషభం (కృత్తిక 2,3,3, రోహిణి, మృగశిర 1,2)

తోబుట్టువులతో తలెత్తిన విభేదాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా, ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఉద్యోగంలో అధికారుల నుంచి మంచి ప్రోత్సాహం ఉంటుంది. ఉద్యోగరీత్యా ప్రయాణం చేయాల్సి వస్తుంది. మంచి కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సానుకూలంగా ఉంటుంది. రుణ సమస్యల నుంచి కొద్దిగా విముక్తులు అవుతారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఇంటా బయటా కొన్ని మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. కుటుంబ పరంగా సామరస్య వాతావరణం నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు సహాయకారిగా ఉంటుంది. కొందరు సన్నిహితులకు సహాయం కూడా చేస్తారు. ఉద్యోగ పరంగా సహచరుల నుంచి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అధికారులు చెప్పుడు మాటలు వినే అవకాశం ఉంది. ఆహార విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వ్యాపారంలోనూ, ఉద్యోగంలోనూ శ్రమ, ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి పరవాలేదనిపిస్తుంది. రాదని వదిలేసుకున్న డబ్బు కొద్ది ప్రయత్నం మీద చేతికి అందుతుంది. ఐటీ నిపుణులు తమ ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు. మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లల నుంచి శుభవార్త ఒకటి అందుతుంది.

Advertisement

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఆర్థికపరమైన ఇబ్బందులు కొద్దిగా చికాకు కలిగిస్తాయి. డబ్బు ఇవ్వాల్సిన వారు ఆలస్యం చేయడం జరుగుతుంది. ఉద్యోగ పరంగా సుస్థిరత ఏర్పడుతుంది. ఒకటి రెండు కొత్త ఉద్యోగ అవకాశాలు మీ ముందుకు వస్తాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి వారు ముందుకు దూసుకు వెళతారు. ఆరోగ్యం పరవాలేదు. పిల్లలు చదువుల్లో ఆశించినంతగా పురోగతి సాధిస్తారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగ పరంగా ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో స్థిరత్వం లభిస్తుంది. ఒక శుభకార్యానికి హాజరు కావడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాల పంట పండించుకుంటారు. ఐటీ నిపుణులు ఉద్యోగం మారతారు. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రయాణాల వల్ల ఆర్థికంగా నష్టపోతారు. పిల్లలకు బాగానే ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం మంచిది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

కుటుంబ పరంగా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వీటివల్ల మున్ముందు మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారులు మీ మాటకు విలువనిస్తారు. బంధువులతో అపార్ధాలు తలెత్తుతాయి. ఆదాయానికి సంబంధించి అత్యాశకు పోవడం మంచిది కాదు. ఉద్యోగం మారటానికి ఇది సమయం కాదు. పిల్లలు బాగా కష్టపడాల్సి ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

అర్ధాష్టమ శని కారణంగా మధ్య మధ్య చిన్నపాటి అనారోగ్యాలు తప్పకపోవచ్చు. అనుకున్న పనులు కొద్దిగా ఆలస్యం అవుతుంటాయి. అనవసర పరిచయాల వల్ల ఇబ్బందులు పడతారు. ఆర్థికంగా పైకి ఎదిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైన అవసరాలకు తగినట్టుగా డబ్బు అందుతుంది. పిల్లలు శుభవార్త తీసుకువస్తారు. ఉద్యోగంలో బాధ్యతగా లక్ష్యాలను పూర్తి చేస్తారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగానే పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు ఆశించిన స్థాయిలో తగ్గుముఖం పడతాయి. ఒకరిద్దరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం కూడా జరుగుతుంది. కుటుంబ వాతావరణం సానుకూలంగా, సామరస్యంగా ఉంటుంది. ఉద్యోగ పరంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆచి తూచి అడుగులు వేయటం చాలా మంచిది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

వృత్తి ఉద్యోగాల్లో పని భారం బాగా పెరుగుతుంది. కుటుంబంలో సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఎవరికైనా డబ్బు ఇవ్వడం కానీ, ఎవరి నుంచైనా డబ్బు తీసుకోవడం కానీ చేయవద్దు. తనకు మాలిన ధర్మం పనికిరాదని అర్థం చేసుకోండి. న్యాయపరమైన విషయాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం పర్వాలేదు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

మీ మంచితనాన్ని అవకాశంగా తీసుకుని ఉద్యోగంలో అదనపు బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. ఏలిన్నాటి శని కారణంగా ప్రతి విషయంలోనూ శ్రమ, ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. కుటుంబ పరిస్థితులు మధ్య మధ్య చికాకు కలిగిస్తాయి. ఉద్యోగ పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పట్లో ఉద్యోగం మారటా నికి అవకాశం లేదు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులను చేపడతారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారులు మీ సలహాలను పాటిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ, ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండటం అవసరం. ఆర్థిక పరిస్థితి లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు కానీ, అనవసర ఖర్చులను తగ్గించుకోవడం మంచిది.

Related Articles

Back to top button