Himachal Pradesh,రోడ్డుపై ట్రక్కు బీభత్సం.. 5 కార్లపైకి దూసుకెళ్లి బోల్తా.. వీడియో వైరల్ – 2 killed as truck looses control on theog chhaila road shimla
హిమాచల్ప్రదేశ్లోని సిమ్లా జిల్లాలో యాపిల్ లోడుతో వెళ్తున్న ఓ లారీ బోల్తా పడిన ఘటనలో భార్యాభర్తలు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ధియోగ్ ఛైలా రోడ్డుపై మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదం అక్కడ పెను విధ్వంసాన్ని సృష్టించింది. బ్రేకులు ఫెయిల్ కావడం.. రాంగ్ రూట్‌లో వెళ్లిన ఆ ట్రక్కుపై డ్రైవర్ కంట్రోల్ తప్పి.. ఎదురుగా ఉన్న మూడు కార్లు, బైక్‌పైకి దూసుకెళ్లింది. అనంతరం రోడ్డు మధ్యలో బోల్తాపడింది. ఆ మూడు కార్లలోని ఓ కారులో ఉన్న ఇద్దరు దంపతులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ట్రక్కు ఢీకొట్టడంతో వాహనాలు తుక్కుతుక్కు అయ్యాయి. అందులో ఉన్నవారు కూడా తీవ్ర గాయాలతో బయటపడ్డారు. అయితే ఆ సమయంలో అక్కడ ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో ఉంచడంతో వైరల్‌గా మారింది.
దీంతో వెంటనే అక్కడే ఉన్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. రెండు జేసీబీల సాయంతో కొన్ని గంటలపాటు శ్రమించి వాహనాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. బోల్తాపడిన లారీని పైకి లేపారు. అనంతరం గాయపడిన వారిని దగ్గర్లో ఉన్న హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన ఇద్దరు దంపతుల మృతదేహాలను పోస్టు మార్టం కోసం థియోగ్ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు వివరాలు వెల్లడించారు. నార్కండ్ నుంచి యాపిల్ పండ్ల లోడుతో వెళ్తున్న ట్రక్కు.. రాజ్‌ఘర్ – సోలన్ రహదారి నుంచి బయటకు వస్తుండగా.. సైన్జ్ – రాజ్‌ఘర్ రహదారి వైపు వెళ్లబోయి.. సిమ్లా జిల్లా చైలా రోడ్డులోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే ట్రక్కు బ్రేకులు పెయిల్ కావడంతో వాహనాలపైకి దూసుకెళ్లింది. లారీ రాంగ్ రూట్లో రావటం, బ్రేక్ ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణమని అని పోలీసుల వెల్లడించారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకు లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు థియోగ్ పోలీసులు తెలిపారు.
Read More Latest National News And Telugu News