Sreeleela: అభిమానులకు క్షమాపణలు చెప్పిన శ్రీలీల.. కారణం ఏంటంటే

ఇటీవల టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న భామ శ్రీలీల. పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది అందం అభినయంతో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ అమ్మడి డాన్స్ కు, ఎనర్జీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక రెండో సినిమాతోనే మాస్ మహారాజాతో కలిసి ధమాకా సినిమాతో మరో హిట్ అందుకుంది ఈ భామ. ఇక ఈ చిన్నది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది. రోజు రోజూ రకరకాల ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది.తాజాగా ఈ అమ్మడు అభిమానులకు క్షమాపణ చెప్పింది. దానికి కారణం ఏంటంటే..
తాజాగా శ్రీలీల సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందమైన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. షూటింగ్ లో భాగంగా ఈ అమ్మడు ఒక గ్రామానికి వెళ్ళింది. అక్కడి రోడ్ల పై, గుడిలో, ఆవుల దగ్గర ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అయితే ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ఫొటోల క్వాలిటీ తక్కువగా ఉండడంపై సారీ చెప్పింది. ‘ఓ క్షణం ఆగి జీవితంలోని చిన్న చిన్న విషయాలను ఎంజాయ్ చేయండి’ అని రాసుకొచ్చింది శ్రీలీల. ప్రస్తుతం ఈ ఈ బ్యూటీ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తోన్న సినిమాలో నటిస్తోంది.
View this post on Instagram