Entertainment

Samantha: సామ్ సంపాదనలో ఎక్కువ దేనికోసం ఖర్చు చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు..!!


టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న భామ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు సమంత. తక్కువ కాలంలో హీరోయిన్ నుంచి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది సమంత.

టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న భామ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు సమంత(Samantha). తక్కువ కాలంలో హీరోయిన్ నుంచి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది సమంత. బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కు దక్కించుకొని టాలీవుడ్ లో టాప్ ప్లేస్ లో కూర్చుంది ఈ బ్యూటీ. సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్నప్పుడే యంగ్ హీరో నాగచైతన్యను పెళ్లాడింది. దాదాపు ఎనిమిదేళ్లు ప్రేమించి పెళ్లాడిన ఈ సామ్ చైతూతో రీసెంట్ గా విడిపోయింది. విధాలుగా తర్వాత ఈ ఇద్దరు ఎవరిజీవితలు వారు జీవిస్తున్నారు. ప్రస్తుతం సామ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తోంది. తెలుగులో గుణశేఖర్ డైరెక్షన్ లో శాకుంతలం, అలాగే యశోద సినిమాలు చేస్తోంది. ఇదిలా ఉంటే సామ్‌కు సంబంధించిన ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

టాలీవుడ్ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ లిస్ట్ లో సమంత ఫస్ట్ ప్లేస్ ఉన్నారు. సమంత డబ్బును ఖర్చు చేయడానికి సంబంధించి షాకింగ్ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంత తాను సంపాధించిన డబ్బుల్లో చాలా వరకు విరాళాల రూపంలో ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. ఇక సమంత సేవాకార్యక్రమాలగురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా తన వంతుగా సేవా చేస్తూ ఉంటుంది సామ్. దాంతో ఒక్కో సినిమాకు 3 కోట్ల రూపాయల వరకు  సమంత రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. అందులో చాలా వరకు సేవాకార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button