Entertainment

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..దక్షిణాది చిత్రపరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు నయనతార. అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు.. హీరోలతో

Anil kumar poka


Anil kumar poka |

Sep 23, 2022 | 9:57 PM

Advertisement
దక్షిణాది చిత్రపరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు నయనతార. అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు.. హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఏకైక హీరోయిన్ నయన్ కావడం విశేషం. సినిమా చేయడం వరకే నయన్ ఉంటారు.. ఆ తర్వాత ప్రమోషన్లలో ఎక్కడా కనిపించరు. అయినా నయన్‌కు ఆఫర్లు క్యూ కడుతుంటాయి. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్ ఇలా ఇలా ఒక్కటేమిటీ అన్ని భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇక ఇప్పుడు డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ అరంగేట్రం కూడా చేస్తున్నారు. షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న జవాన్ చిత్రంలో నయన్ కథానాయికగా నటిస్తున్నారు. ఇక ఇటీవలే ప్రియుడు డైరెక్టర్ విఘ్నేష్ శివన్‏ను వివాహం చేసుకున్న నయన్.. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఆమె తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.లేటేస్ట్ సమాచారం ప్రకారం నయన్ ఒక్కో సినిమాకు 10 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే.. ఆమె ఆస్తి విలువ దాదాపు 165 కోట్లు అట. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పలు వాణిజ్య సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఇందుకుగానూ ఒక్కో సంస్థ నుంచి 5 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారట. అలాగే ఆమెకు హైదరాబాద్ లో రెండు ఖరీదైన బంగ్లాలు, చెన్నైలో అధునాతర వసతులతో కూడిన నాలుగు ప్లాట్లు, కేరళలోని తన తల్లిదండ్రులు నివసిస్తున్న ఇల్లు.. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో సొంత ఇళ్లను ఏర్పాటు చేసుకున్నారట. హైదరాబాద్ లోని ఒక్కో ప్లాట్ సుమారు 15 కోట్లు విలువ చేస్తుందని అంచనా. అంతేకాకుండా ఆమెకు ప్రత్యేకంగా ఒక జెట్ విమానం కూడా ఉందని సమాచారం. ఇక గత కొద్ది రోజులుగా నయన్ సినిమాల కంటే బిజినెస్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పలు కంపెనీలతో భాగస్వామ్యం కూడా ఏర్పర్చుకున్నారట.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

MLA viral video: ప్రభుత్వ పాఠశాల టాయిటెట్స్ శుభ్రం చేసిన ఎమ్మెల్యే.. అశుభ్రంగా ఉండటంపై సీరియస్..(వీడియో)

Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..


Related Articles

Back to top button