Entertainment

Kangana Ranaut: పిలిచి అవార్డు ఇస్తానంటే కేసు వేస్తానంటున్న కంగనా.. కారణం ఏంటంటే


కంగనా.. ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు అంటే అతిశయోక్తికాదేమో.. కాంట్రవర్సయిలకు కేరాఫ్ అడ్రస్ ఈ అమ్మడు. విషయం ఏదైనా వివాదం రేపడం ఈ అమ్మడి స్టైల్.

కంగనా(Kangana Ranaut).. ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు అంటే అతిశయోక్తికాదేమో.. కాంట్రవర్సయిలకు కేరాఫ్ అడ్రస్ ఈ అమ్మడు. విషయం ఏదైనా వివాదం రేపడం ఈ అమ్మడి స్టైల్. స్టార్ హీరోల నుంచి రాజకీయ నాయకుల వరకు ఎవ్వరిని వదల్లేదు ఈ చిన్నది. హీరోయిన్ గా కంటే కాట్రవర్సీ లతోనే ఎక్కువ పాపులర్ అయ్యింది ఈ బ్యూటీ. ఈ మధ్య కాలంలో కాస్త సైలెంట్ అయ్యింది కంగన. రీసెంట్ గా ‘ధాకడ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా రిజల్ట్ తర్వాత పెద్దగా కనపడలేదు. ఆలాగే లాకప్ అనే రియాలిటీ షో కూడా నిర్వహించింది కంగనా. ఇదిలా ఉంటే తాజాగా మరో కాంట్రవర్సీ తో ముందుకు వచ్చింది.

ఈసారి ఈ అమ్మడు ఫిలిం ఫేర్ అవార్డులను టార్గెట్ చేసింది. తనకు అవార్డు ఇస్తాన్నందుకు ఫిలిం ఫేర్ వాళ్ల మీద కేసు వేయడానికి ఆమె సిద్ధమైంది. అవార్డులను కంగనా బ్యాన్ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. గతంలోనూ కంగనాకు అవార్డులు ఇస్తామన్నా కూడా ఆమె రిజెక్ట్ చేసింది. అయితే ఈసారి ఫిల్మ్ ఫేర్ నిర్వాహకులు ‘తలైవి’ సినిమాకి గాను కంగనాకు బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఆమె దృష్టికి తీసుకువెళ్తే ఆమె రిజక్ట్ చేసిందట. అయినా కూడా తనకు కాల్ చేసి విసిగిస్తున్నారంటూ.. ఫిల్మ్ ఫేర్ వాళ్ల మీద మండిపడింది కంగనా. అవార్డు వద్దన్నా కూడా తనను నామినేట్ చేశారని, ఇలాంటి అవినీతి అవార్డులు అందుకోవడానికి నా విలువలు ఒప్పుకోవని చెప్పుకొచ్చింది. ఇలాగే విసిగిస్తే కేసు వేస్తానంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చిందట కంగనా.

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button