Entertainment

Raj Tarun: ”నువ్వు ఎక్కడున్నా పట్టుకుంటా.. నీ అంతు చూస్తా”.. రాజ్ తరుణ్ ఎమోషనల్ కామెంట్స్


Raj Tharun

యంగ్ హీరో రాజ్ తరుణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న విషయం తెలిసిందే. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ కుర్ర హీరో.. హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందు పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన రాజ్ తరుణ్. ఆ తర్వాత ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈ యంగ్ హీరో వరుస సినిమాలు చేస్తున్నారు. ఇక సుకుమార్ శిష్యుడు సూర్య తెరకెక్కించిన కుమారి 21 ఎఫ్ సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. ఇక ఈ మధ్య కాలంలో రాజ్ తరుణ్ నటించిన సినిమాలో ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఈసెంట్ గా ఒరేయ్ బుజ్జిగా సినిమాతో హిట్ అందుకున్నాడు. అయితే ఈ మధ్య చిన్న గ్యాప్ తీసుకున్న రాజ్ తరుణ్ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ కథ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

రాజ్ తరుణ్ రీసెంట్‌గా చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘‘హలో అండీ.. నేను సడెన్‌గా ఈ వీడియో పెట్టడానికో కారణం ఉంది.. మీకొక అమ్మాయి గురించి చెప్పాలి.. అసలు నా జీవితంలో అమ్మాయి అనే టాపిక్ వస్తుందని నేనెప్పుడూ అనుకోలా.. చిన్నప్పటినుండి మా ఫ్రెండ్స్, వాళ్ల గర్ల్ ఫ్రెండ్స్‌తో కలిసి తిరుగుతుంటే.. నేను ఇంట్లో అమ్మకి కొత్తిమీర, కరివేపాకు తెచ్చుకుంటూ తిరిగేవాణ్ణి.. మా ఫ్రెండ్స్‌ని చూస్తే అసూయ.. అమ్మాయిలతో మాట్లాడాలంటే భయం.. అర్థమైపోయింది.. మన జీవితంలో లవ్వూ, గివ్యూ సెట్ కావని.. సిన్సియర్‌గా వెళ్లి నాకు పెళ్లి చెయ్యండని మా అమ్మా, నాన్నని అడిగా.. మొదట కంగారుపడ్డా.. తర్వాత నా కరువు అర్థం చేసుకుని ఓ మంచి సంబంధం చూశారు.

ఇంకేముంది.. పెళ్లి సెట్టు, మండపం సెట్టు, రాబందులు, అదే చుట్టాలొచ్చారు.. పండక్కి తయారు చేసిన గంగిరెద్దులా రెడీ చేసి కూర్చోబెట్టారు. మండపానికి తీసుకెళ్లి, పెళ్లిపీటల మీద కూర్చోబెట్టారు.. పంతులు, పెళ్లి కూతుర్ని తీసుకురామ్మా.. అన్నాడు.. వాళ్ల చెల్లి వెళ్లి ఓ ఉత్తరం పట్టుకొచ్చింది.. ఛీ, ఛీ.. నా నోటితో నేను చెప్పలేను.. మీకర్థమై ఉంటుంది కదా.. మొగుడు పోయి ఏడుస్తుంటే సామెతలా ఈ చుట్టాలంతా వచ్చి ఎధవ ఎటకారాలు.. చచ్చిన పాముని ఇంకా ఎంత సేపు చంపుతారు.. వాళ్లని కాదు.. దాన్ననాలి.. ఒసేయ్, నువ్వు ఎక్కడున్నా పట్టుకుంటా.. నీ అంతు చూస్తా.. రేపే నీ ఫొటో ఆన్‌లైన్‌లో పెడతా.. మీ అందరూ కూడా కనబడితే నాకు చెప్పండి.. ప్లీజ్.. థ్యాంక్యూ వెరీమచ్’’ అంటూ చెప్పుకొచ్చాడు.

 

View this post on Instagram

 

A post shared by Raj Tarun (@rajtarunn)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

 

Advertisement



Related Articles

Back to top button