Entertainment

Mahesh Babu: మహేష్ బాబు బీస్ట్ లుక్.. ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది.. ఇక రచ్చే


పాన్ ఇండియా సినిమాలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా మహేష్ కు ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమా వస్తుందంటే చాలు అభిమానులకు పండగే..

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా సినిమాలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా మహేష్ కు ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమా వస్తుందంటే చాలు అభిమానులకు పండగే.. వరుస విజయాలతో దూసుకుపోతోన్న సూపర్ స్టార్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ అని కొంతమంది అంటుంటే మరికొందరు ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అంటున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ నుంచి లీక్ అయిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే మహేష్ ఈ సినిమాలో సాలిడ్ లుక్ లో కనిపించనున్నారని తెలుస్తోంది.

తాజాగా మహేష్ బాబు షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. మహేష్ బాబు ఫిట్ నెస్ కు ప్రాధాన్యం ఇస్తాడన్న విషయం తెలిసిందే. జిమ్ లో వర్కౌట్స్ చేస్తోన్న ఫొటోస్ ను వీడియోలను షేర్ చేస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడూ బాడీని చూపించలేదు.

తాజాగా మహేష్ ఆర్మ్ డే అంటూ ఆయన కండలను చూపించాడు.ఈ ఫొటోస్ లో మహేష్ బాబు చూసిన అభిమాను పూనకాలతో ఊగిపోతున్నారు. బాబులకు బాబు మా మహేష్ బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ బాబు బీస్ట్ లుక్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. త్రివిక్రమ్ తర్వాత మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేస్తోన్న విషయాజ్మ్ తెలిసిందే.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



Advertisement

Related Articles

Back to top button