Entertainment

Mahesh- Rajamouli: నెక్ట్స్‌ ఆస్కార్‌ను టార్గెట్‌ చేశారా ఏంటి? ట్రెండింగ్‌లో మహేశ్‌- రాజమౌళిల లేటెస్ట్‌ ఫొటో


ఆస్కార్‌ పురస్కారంతో రాజమౌళి తర్వాతి ప్రాజెక్టుపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అందులోనూ సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబుతో సినిమాను చేస్తుండడంతో అభిమానులు ఓ రేంజ్‌లో ఊహించుకుంటున్నారు. ఈక్రమంలోనే మహేశ్‌- రాజమౌళిల కొత్త ఫొటో ఒకటి బయటకు వచ్చింది.

ఆర్‌ఆర్‌ఆర్ డైరెక్టర్‌ రాజమౌళి ప్రస్తుతం ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. గతేడాది మార్చి 25న ఈ సినిమా రిలీజైనప్పటి నుంచి తాజాగా ఆస్కార్‌ అవార్డు అందుకునేదాకా ఆర్‌ఆర్‌ఆర్‌తోనే సహవాసం చేశారాయన. మొత్తానికి తాను కోరుకున్న టార్గెట్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశారు జక్కన్న. ఆస్కార్‌ పురస్కారంతో రాజమౌళి తర్వాతి ప్రాజెక్టుపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అందులోనూ సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబుతో సినిమాను చేస్తుండడంతో అభిమానులు ఓ రేంజ్‌లో ఊహించుకుంటున్నారు. ఈక్రమంలోనే మహేశ్‌- రాజమౌళిల కొత్త ఫొటో ఒకటి బయటకు వచ్చింది. అలా రిలీజైందో లేదో ఒక్కసారిగా సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయింది. కాగా మహేశ్‌తో సినిమా చేస్తున్నట్లు కరోనా లాక్‌డౌన్‌లోనే ప్రకటించారు జక్కన్న. అయితే ఆర్‌ఆర్‌ఆర్‌ రిలీజ్‌, ఆతర్వాత ఆస్కార్‌ ప్రమోషన్లతో అది కాస్తా ఆలస్యమవుతూ వస్తోంది. ఎస్‌ఎస్‌ఎంబీ 29 (వర్కింగ్ టైటిల్‌) సినిమా సెట్స్‌పైకి వెళ్లకపోయినా సామాజిక మాధ్యమాల్లో మాత్రం తరచూ ట్రెండ్‌ అవుతూ వస్తోంది. జేమ్స్‌బాండ్‌ స్టోరీతో అంతర్జాతీయ హంగులతో పాన్‌ వరల్డ్‌ సినిమాగా దీనిని తెరకెక్కించనున్నట్లు ప్రచారం జరిగింది.

ఇదిలా ఉంటే ఆమెరికా నుంచి వచ్చిన వెంటనే మహేశ్‌ని కలిశారు రాజమౌళి. ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. అందుకు సంబంధించిన ఓ ఫొటో తాజాగా బయటకొచ్చింది. ఇందులో మహేశ్‌, రాజమౌళి చాలా కూల్ గా మాట్లాడుకుంటూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. ఇద్దరూ నెక్ట్స్‌ ఆస్కార్‌ను టార్గెట్‌ చేశారేమో? అని అభిమానులు, నెటిజన్లు ఈ వైరల్‌ ఫొటోపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా మహేశ్‌ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 28 సినిమాలో నటిస్తున్నాడు. పూజా హెగ్డే మెయిన్‌ హీరోయిన్‌ కాగా, లేటెస్ట్‌ సెన్సేషన్‌ సంయుక్త సెకెండ్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. ఎస్‌.ఎస్‌.థమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్‌ రానున్నాయి.

ఇవి కూడా చదవండి

Advertisement

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం  క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండిRelated Articles

Back to top button