Adivi Sesh: హీరో అడివి శేష్ ఇంట్లో పెళ్లి బాజాలు.. సందడి చేసిన సినీ తారలు.. ఫొటోలు వైరల్
యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో అడివి శేష్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. అతని సోదరి షిర్లీ పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా హల్దీ, మెహందీ ఈవెంట్స్ వేడుకలు అంబరాన్నంటాయి.
యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో అడివి శేష్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. అతని సోదరి షిర్లీ పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా హల్దీ, మెహందీ ఈవెంట్స్ వేడుకలు అంబరాన్నంటాయి. ప్రముఖ కమెడియన్ వెన్నెల కిశోర్‌తో పాటు పలువురు సినిమా తారలు ఈ వేడుకల్లో సందడి చేశాడు. కాగా తన సోదరి వివాహానికి సంబంధించిన ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు అడివి శేష్ . ‘చెల్లి పెళ్లిలో అమ్మానాన్న, నేను ఆనందంగా గడుపుతున్నాం. మా బావ డేవిన్ ని మా కుటుంబంలోకి ఆహ్వానించబోతున్నాం’ అని ఒక పోస్టు షేర్ చేయగా.. ‘చిట్టి చెల్లికి పెళ్లి జరుగుతోంది. రాజస్థానీ థీమ్ ట్రై చేశాం. కానీ పెళ్లి మాత్రం తెలుగు సంప్రదాయం ప్రకారమే జరుగుతుంది’ అని మరో పోస్టును పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలువురు సినిమా సెలబ్రిటీలు కాబోయే దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి
క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్, హిట్2.. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు అడివిశేశ్. ముఖ్యంగా గతేడాది అతనికి బాగా కలిసొచ్చింది. మేజర్, హిట్ 2 సినిమాలు భారీ విజయాలు సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు గూఢచారి సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రానుననాడు. ఇటీవలే ఈ సినిమాకి సబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేశారు. మొదటి పార్ట్‌ను మించి మరింత ఉత్కంఠగా, ఆసక్తికరంగా ఈ సినిమాను తెరెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో గూఢచారి 2 ను రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..