News

Heart Health: ఇలాంటి లక్షణాలు కనిపిస్తే గుండెలో రంధ్రం ఉన్నట్లే.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. | Heart health symptoms seen when there is a hole in heart telugu health tips


నేటి కాలంలో గుండెకు సంబంధించిన వ్యాధులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. అయితే, సరైన అవగాహన లేకపోవడంతో ప్రజలు సరైన సమయంలో వీటిని గుర్తించలేక తీవ్ర వ్యాధుల బారిన పడుతున్నారు.

Hole In Heart Symptoms: నేటి కాలంలో గుండెకు సంబంధించిన వ్యాధులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. అయితే, సరైన అవగాహన లేకపోవడంతో ప్రజలు సరైన సమయంలో వీటిని గుర్తించలేక తీవ్ర వ్యాధుల బారిన పడుతున్నారు. అదే సమయంలో గుండెకు సంబంధించిన తీవ్రమైన సమస్య.. గుండెలో రంధ్రం ఉండటం వల్ల కూడా సంభవిస్తుంది. వాస్తవానికి ఈ సమస్య పుట్టుకతోనే వస్తుంది. కానీ గుండెలో రంధ్రం ఏర్పడితే దాని లక్షణాలను సరైన సమయంలో గుర్తించడం కష్టం. అయితే దీనిని సకాలంలో గుర్తించడం ద్వారా చికిత్స అందించవచ్చు. అలాంటి పరిస్థితిలో.. గుండెకు రంధ్రం ఏర్పడినప్పుడు శరీరం ఎలాంటి సంకేతాలు ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

గుండెలో రంధ్రం ఉంటే కనిపించే లక్షణాలు..

ఇవి కూడా చదవండి



  1. గుండెలో రంధ్రం కారణంగా వేడి వాతావరణంలో కూడా చల్లబడటం లాంటి సంకేతాలు కనిపిస్తాయి. వేసవి కాలంలో చల్లగా ఉన్నా లేదా మీ శరీరం ఎల్లప్పుడూ చల్లగా ఉన్నా అప్పుడు మీరు తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి. ఎందుకంటే అలాంటి సమస్య ఉంటే గుండెకు రంధ్రం లేదా గుండె సంబంధిత వ్యాధి వచ్చే అవకాశముంటుంది.
  2. ఎల్లప్పుడూ అలసటగా అనిపించడం, ఎక్కువగా చెమటలు పట్టడం కూడా గుండెలో రంధ్రం ఉండే లక్షణాలే. మీరు ఎల్లప్పుడూ అలసిపోయి ఎక్కువగా చెమటలు పడుతూ ఉంటే.. దానిని విస్మరించకుండా వైద్యులను సంప్రదించాలి.
  3. శ్వాస తీసుకోవడంలో మళ్లీ మళ్లీ ఇబ్బంది ఉంటే న్యుమోనియా, గుండె జబ్బులు లేదా గుండెలో రంధ్రం వంటి సమస్యలను కూడా కలిగి ఉండవచ్చు. అలాంటప్పుడు వెంటనే వైద్యలను సంప్రదించాలి.
  4. మీరు మాట్లాడేటప్పుడు లేదా నడుస్తున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించడం ప్రారంభిస్తే, గుండెలో రంధ్రం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో చిన్న పిల్లలు కూడా మాట్లాడేందుకు ఇబ్బంది పడుతూ కనిపిస్తారు.
  5. గుండెలో రంధ్రం సమస్యతో ఉంటే.. పిల్లల శరీరం రంగు నీలం రంగులోకి మారుతుంది. ఈ సమయంలో పెదవులు, గోర్లు తీవ్రంగా ప్రభావితమవుతాయి. అటువంటి లక్షణాలు శరీరంలో కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button