News

Health Tips: నరాల బలహీనత గుండెపోటుకు కారణం కావచ్చు.. మీ డైట్‌లో వీటిని జోడించండి.. | Heart Attacks Symptoms, Risk Factors, Diagnosis and Treatment ful details here


ఇటీవల కాలంలో గుండెపోటు కారణంగా సంభవిస్తున్న మరణాలు, హార్ట్ ఎటాక్ బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువుగా ఉంది. వయసుతో సంబంధం లేకుండా యువత గుండె పోటుకు గురౌతున్నారు. శరీరం అనేక రకాల..

ఇటీవల కాలంలో గుండెపోటు కారణంగా సంభవిస్తున్న మరణాలు, హార్ట్ ఎటాక్ బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువుగా ఉంది. వయసుతో సంబంధం లేకుండా యువత గుండె పోటుకు గురౌతున్నారు. శరీరం అనేక రకాల సిరలు, ధమనులతో ఉంటుంది. శరీరంలోని  రక్త నాళాలు గుండె నుంచి శరీర కణజాలాలకు రక్తాన్ని తీసుకెళుతాయి. ఆరోగ్యకరమైన శరీరం కోసం ఇతర భాగాల మాదిరిగానే రక్త నాళాల పట్ల శ్రద్ధ వహించడం అవసరం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సిరలు మృదువుగా సరళంగా ఉంటాయి. దీని కారణంగా రక్తం సులభంగా ప్రవహిస్తుంది. మీ నరాలు బలహీనపడకుండా ఉండాలంటే కొన్ని మంచి అలవాట్లు పాటించాలి. వాటి గురించి తెలుసుకుందాం. నరాల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే వాటిలో కొవ్వు పేరుకుపోతుంది. ఇది ప్రమాదాన్ని పెంచుతుంది. కొన్నిసార్లు సిరలు గట్టిపడటం వల్ల గుండెపోటు సంభవిస్తుంది. నరాలు, రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండాలంటే శారీరకంగా చురుగ్గా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే హెల్తీ డైట్ పాటించాలి.

ఫైబర్ రిచ్ ఫుడ్స్..

ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. దీనివల్ల కొలెస్ట్రాల్‌ నియంత్రణలో ఉంటుంది. ఆహారంలో తృణధాన్యాలు ఉండేలా చూసుకోండి. ఉప్పు, చిప్స్ లేదా స్వీట్ క్యాండీలకు బదులుగా ఎక్కువ పండ్లు కూరగాయలను తినండి.

ఆకుపచ్చని కూరగాయలు

ఆకుపచ్చని ఆకుకూరలు రక్తనాళాలకు చాలా మంచివి. వివిధ రంగుల పండ్లు, కూరగాయలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా నరాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. బయోఫ్లావనాయిడ్స్ ఆకుకూరల్లో ఉండే ఫైటోన్యూట్రియెంట్లు ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. వీటితో పాటు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు ఇందులో ఉండటం వల్ల నరాలు దృఢంగా మారుతాయి.

మిరపకాయలు, పసుపు వినియోగం

మసాలా దినుసులు నరాలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది ధమనులని గట్టిపడకుండా చేస్తుంది. మరోవైపు ఎర్ర మిరప రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది.

ఉప్పు తక్కువగా..

మీరు నరాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే సోడియం తగ్గించాలి. నరాల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఆహారంలో సోడియం స్థాయిని అదుపులో ఉంచుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని కోసం మీరు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని నివారించాలి. ఎందుకంటే వీటిలో సోడియం ఎక్కువగా ఉంటుంది. ప్యాక్ చేసిన ఆహారాన్ని కొనుగోలు చేసే ముందు అందులో సోడియం మొత్తాన్ని తనిఖీ చేయాలి.

Advertisement

ఇవి కూడా చదవండిమరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Articles

Back to top button