News
hayat nagar, Hyderabad: హైదరాబాద్‌లో భారీ చోరీ కలకలం.. పోలీస్ అధికారి ఇంట్లోకే చొరబడిన దొంగలు – there was a massive theft at the house of a police officer named shiva narayana in hayatnagar
ఇంట్లో ఉన్న మూడు లక్షల నగదు, ఐదు తులాల బంగారాన్ని అపహరించుకుపోయారు. శివ నారాయణ తన ఫ్యామిలీతో కలిసి వేరే ఊరు వెళ్లాడు. ఇంటికి వచ్చి చూసుకున్న తర్వాత తాళం పగలగొట్టి ఉంది. దీంతో ఇంట్లోకి వెళ్లి చూడగా దొంగతనం జరిగినట్లు అర్థమైంది. డబ్బులు, బంగారం ఆభరణాలను చోరీ చేసి తీసుకెళ్లినట్లు గుర్తించారు. శివ నారాయణ వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇంటి మొత్తాన్ని పరిశీలించారు. ఎంత సొమ్ము చోరీకి గురైందనే వివరాలను నమోదు చేసుకున్నారు.
ఈ చోరీపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగా ఆ ప్రాంతంలోని సీసీటీవీ పుటేజీని పరిశీలిస్తున్నారు. చోరీకి పాల్పడ్డ దుండగులను గుర్తించే పనిలో పడ్డారు. దొంగలు తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఇంటికి తాళం వేసుకుని వేరే ప్రాంతానికి వెళ్లేటప్పుడు ప్రజలు జాగ్రత్తలు ఉండాలని, ఇలాంటి సమయాల్లో ఇంటిని గమనించాల్సిందిగా ఇరుగు పోరుగు వారికి చెప్పి వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.