News
harish rao comments on babu, ‘చంద్రబాబుని కదిలిస్తే చార్మినార్ కూడా నేనే కట్టానంటాడు’ – minister harish rao comments on tdp president nara chandrababu naidu
సిద్ధిపేట జిల్లా జగదేవ్‌పూర్‌లో చాట్లపల్లి సర్పంచ్ రాచర్ల రమేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి గ్రేస్ బాల్-క్రికెట్ టోర్నమెంట్ విజేత, రన్నరప్‌లకు మంత్రి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ జన్మదినం పురస్కరించుకుని క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన రాచర్ల రమేశ్‌ను అభినందించారు. కేసీఆర్ కారణజన్ముడని, చరిత్రను తిరగరాశారని, కేసీఆర్ లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొండపోచమ్మ, మల్లన్న సాగర్‌లకు నీళ్లు వచ్చేవి కావని వివరించారు.
తైవాన్ దేశం నుంచి పాక్స్‌కాన్ కంపనీ లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం కేసీఆర్ గారిని చెప్పటం హర్షించదగ్గ విషయమని హరీశ్ రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధిపై ప్రజంటేషన్ ఇవ్వగా.., ఏడేండ్లలో అబ్బురపోయేలా సాధించిన అభివృద్ధి, కేసీఆర్ విజన్ చూసి.. తైవాన్ వచ్చి తమ ప్రభుత్వానికి వివరించాలని ఆ దేశ ప్రతినిధులు కోరినట్లు తెలిపారు. గుక్కెడు తాగునీటి కోసం ఇబ్బందులు పడ్డ ఈ గడ్డపై ఇవాళ మండుటెండలో చెరువులు నిండి మత్తడి దూకుతున్నాయని సంబురం వ్యక్తం చేశారు.
- Read More Telangana News And Telugu News