News

harassment of woman, Vijayawada: స్నానం చేస్తుండగా ఫొటోలు తీశాడు.. ఏడాదిగా బెదిరిస్తూ.. – subhash took pictures while the woman was taking a bath


Vijayawada నగరంలోని విశాలాంధ్ర కాలనీకి చెందిన పుట్టా సుభాష్‌ అనే వ్యక్తి.. బీపీసీఎల్‌ కంపెనీలో పైపులైను సెట్టింగ్‌ పనులు చేస్తుంటాడు. ఇటు రాజీవ్‌నగర్‌కు చెందిన ఓ మహిళ శాంతినగర్‌లో తన భర్తతో కలిసి కిరాణా దుకాణం నిర్వహిస్తోంది. దుకాణంలో సరకులు కొనుగోలు చేసి, ఫోన్‌ పే, పేటియం ద్వారా పలుమార్లు నగదు చెల్లింపులు చేసే సందర్భంలో.. ఆ మహిళ ఫోన్‌ నెంబరును సుభాష్ తెలుసుకున్నాడు. అలా.. సరకులకు వెళ్లినప్పుడల్లా ఆమెతో మాటలు కలిపాడు.

ఒక రోజున ఆమె ఇంటి వద్ద స్నానం చేస్తుండగా.. సుభాష్ (Subhash) ఫొటోలు తీశాడు. వాటిని ఆమెకు చూపించి, తన మాట వినకపోతే.. ఫొటోలు బయట వ్యక్తులకు చూపుతానని బెదిరించాడు. ఆమె వద్దన్నా వినకుండా.. బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కూడా ఇంట్లో ఎవరూ లేని సమయంలో పలుమార్లు అత్యాచారం చేశాడు. అక్కడితో ఆగకుండా… ఆమెను బెదిరించి రూ.16లక్షలు తీసుకున్నాడు. తిరిగి ఇవ్వాలని అడిగితే ఆమెను కొట్టాడు. వేధింపులకు గురి చేశాడు.

ఇలా ఏడాది కాలంగా ఆమెపై అత్యాచారం చేశాడు. ఇటీవల ఆమెను కొట్టడంతో.. వేధింపులు తాళలేని బాధితురాలు… ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో వారు సుభాష్‌పై ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. సుభాష్‌కు న్యాయమూర్తి రిమాండ్‌ విధించారు.

  • Read Latest Andhra Pradesh News and Telugu News

Related Articles

Back to top button