News

Happy Life: సంతోషకరమైన జీవితానికి అద్భుతమైన మార్గాలు | Happy Life: Secrets to a Healthy and Happy Life


Subhash Goud

Subhash Goud |

Updated on: Mar 18, 2023 | 6:30 AM

ఇప్పుడున్న రోజుల్లో ప్రతి మనిషి బిజీ లైఫ్‌కు అలవాటు పడిపోతున్నాడు. దీని వల్ల టెన్షన్స్‌ పెరిగిపోతే రోగాల బారిన పడుతున్నాడు. అధిక ఆలోచనల వల్ల మానసిక ప్రశాంతత

Happy Life: సంతోషకరమైన జీవితానికి అద్భుతమైన మార్గాలు

Happy Life

ఇప్పుడున్న రోజుల్లో ప్రతి మనిషి బిజీ లైఫ్‌కు అలవాటు పడిపోతున్నాడు. దీని వల్ల టెన్షన్స్‌ పెరిగిపోతే రోగాల బారిన పడుతున్నాడు. అధిక ఆలోచనల వల్ల మానసిక ప్రశాంతత లేకుండా పోతోంది. కొన్ని చిన్న చిన్న సంతోషాల ద్వారా మంచి జీవితాన్ని గడపవచ్చని మానసిక నిపుణులు చెబుతున్నారు. మనిషి ఎల్లపుడూ సంతోషంగా ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని విషయాలని వదిలేయాల్సిందేనని చెబుతున్నారు మానసిక నిపుణులు. వాటిలో మొదటగా వదిలేయాల్సినది ఎవ‌రికి వారు సొంత డ‌బ్బా కొట్టుకోవ‌డం.. చాలా మందికి ఎవ‌రి గొప్పలు వారే స్వయంగా చెప్పుకోవడం, త‌మ‌ను తామే పొగుడుకోవ‌డం అల‌వాటు. కానీ దీన్ని అస్సలు పాటించ‌కూడ‌ద‌ట‌. అలా పాటిస్తే జీవితంలో ఏదో ఒక రోజు పెద్ద ఎదురు దెబ్బ తింటార‌ని చెబుతున్నారు.

  1. సానుకూలతపై దృష్టి పెట్టండి: మీరు దీర్ఘకాలిక ఆనందాన్ని పొందడానికి మీ మెదడుపై ప్రతికూల మనస్తత్వం నుంచి సానకూల మనస్తత్వానికి మళ్లీ శిక్షణ ఇవ్వండి. మంచి ఆలోచనలు చేయడండి. చెడు ఆలచనలను దరికి రానీవ్వకండి.
  2. చిన్న చిన్న విజయాలకు సంతోష పడండి.. ప్రతి మనిషి జీవితం ఒడిదొడుకులతో సాగిపోతుంటుంది. మనకు పెద్దగా గుర్తించలేని చిన్న చిన్న విజయాలు ఉంటాయి. అలాంటి చిన్నపాటి విజయాలను ఆనందంగా జరుపుకోవడం కోసం కొంత సమయం కేటాయించండి. అప్పుడు మీ జీవితం ఆనందంగా ముందుకు సాగుతుంది. మనం ప్రతి రోజు పని ఒత్తిడిలో మునిగిపోతుంటాము. కానీ అలాంటి ఒత్తిడిల నుంచి బయటపడేందుకు కొంత సమయం కుటుంబ సభ్యులతో కేటాయించండి. స్నేహితులు, ప్రియమైన వారితో కొంత సమయం గడపడండి. దీని వల్ల జీవితంలో ఒత్తిడి తగ్గుతుంది. సంతోషాలు ఏర్పడతాయి.
  3. పెయింటింగ్‌ వేయండి: మీరు సంతోషంగా ఉండేందుకు అప్పుడప్పుడు మ్యూజిక్‌ వినండి. పెయింటింగ్‌ వేయండి. డ్రాయింగ్‌ వేయండి. ఇలాంటివి అప్పుడప్పుడు చేస్తుంటే మనసు రిలాక్స్‌ అవుతుంది. ఒత్తిడి నుంచి బయటపడి జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగాన్ని ద్వేషిస్తే సంతోషాలను కాపాడుకోవడం కొంత కష్టం. మీరు ఎంతటి ఉద్యోగాన్ని చేస్తున్నప్పటికీ కుటుంబ సభ్యులతో గడపడం అలవాటు నేర్చుకోండి. పదేపదే ఉద్యోగంలో బిజీగా ఉంటూ కుటుంబ సభ్యులు దూరంగా ఉండకండి.
  4. ఆలోచనలు.. ప్రతి ఒక్కరికి ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి. ఉద్యోగంలో టెన్షన్, ఆర్థిక ఇబ్బందుల టెన్షన్‌.. ఇలా రకరకాలుగా ఉన్న ఆలోచనలు మనసును పాడు చేస్తుంటాయి. మన ఆలోచనలు మన భావాలు మన భవిష్యత్తు చుట్టు తిరుగుతుంటాయి. అలాంటి ఆలోచనలు పెట్టుకోకపోవడం మంచిది.
  5. Advertisement

    ఇవి కూడా చదవండి



  6. కృతజ్ఞతా భావాన్ని పెంపొందించుకోండి: మీరు కృతజ్ఞతా భావాన్ని పెంపొందించుకోండి. మీ వద్ద ఉన్నదానితోనే తృప్తి పడండి. మీ దగ్గర ఉన్న కృతజ్ఞతతోనే మీ జీవితంలో సంతోషాలు తెచ్చిపెడుతుంది. ఏ విషయంలో నిరాశ పడకూడదు. ఉన్నదానితోనే సంతృప్తి పొందడం నేర్చుకోవాలి. మీరు ఇతరులకు సహాయం చేయడం నేర్చుకోండి. ఇతరులకు డబ్బు ఖర్చు చేయడంలో ఉదారంగా ఉన్నవారు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. మానవత్వం అలవాటు చేసుకోండి.
  7. సంగీతాన్ని వినండి: అప్పుడప్పుడు సంగీతాన్ని వినండి. మనసు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒత్తిడి నుంచి దూరమవుతారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. సంగీతం వినడం వల్ల మనసులో ఉత్సాహం పెరుగుతుంది. ఇది మనకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఎందుకంటే సంగీతం వినడం వల్ల మన మెదడు డోపమన్‌ను విడుదల చేస్తుంది.
  8. స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడపండి: మీరు ఇతరులపై ఆధారపడకుండా మీ గురించి మీరే ఒక అంచనా వేసుకోండి. మీరు ఎప్పుడు కూడా ఒంటిగా ఉండకూదు. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో గడిపేందుకు సమయం ఇవ్వండి. దీని వల్ల ఉద్యోగంలో ఉండే ఒత్తిళ్లు దూరమావుతాయి. ప్రతి చిన్న విషయానికి మీరు ఆలోచించడం మానేయాలి. దీని వల్ల మీరు ఒత్తిడికి గురై సంతోషానికి దూరమవుతుంటారు. మీరు సంతోషంగా ఉండే వ్యక్తులతో మాట్లాడండి. మీ భావాలను ఒకరికొకరు పంచుకోండి. దీని వల్ల ఒత్తిడి నుంచి దూరమై సంతోషంగా ఉండగలుగుతారు.
  9. ప్రతికృతిలో గడపండి: మీరు అప్పుడప్పుడు ప్రకృతిలో గడపడండి. ప్రతికృతిలో ఎక్కువ సేపు గడపడం వల్ల ఒత్తిడి నుంచి బయటపడి ఉల్లాసంగా ఉండగలుగుతామని మానసిక నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం  క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Articles

Back to top button