News

Hansika Motwani : ఈఫిల్ టవర్ ముందు హన్సికకు పెళ్లి ప్రపోజల్.. కాబోయే భర్త ఫోటోస్ షేర్ చేసిన హీరోయిన్.. వరుడెవరంటే..


తాను డిసెంబర్‏లో పెళ్లి చేసుకోబోతున్నానంటూ హింట్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది. ఆమె తన చిన్ననాటి స్నేహితుడు.. వ్యాపార భాగస్వామి సోహైల్‏ను వివాహం చేసుకుంటున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ..

గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో హీరోయిన్ హన్సిక పెళ్లి వార్తలు వైరలవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ ఎంగెజ్మెంట్ జరిగిందని.. త్వరలోనే అత్యంత వైభవంగా వివాహం జరగనుందంటూ ఫిల్మ్ సర్కిల్లో టాక్ నడించింది. ఇక తాజాగా తన పెళ్లి గురించి వస్తున్న రూమర్స్ నిజమంటూ తేల్చీచెప్పేసింది హన్సిక. ఇటీవల తాను డిసెంబర్‏లో పెళ్లి చేసుకోబోతున్నానంటూ హింట్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది. ఆమె తన చిన్ననాటి స్నేహితుడు.. వ్యాపార భాగస్వామి సోహైల్‏ను వివాహం చేసుకుంటున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. అతను తనకు ఈఫిల్ టవర్ ముందు మ్యారీ మీ అంటూ ప్రపోజ్ చేసిన ఫోటోస్ ఇన్ స్టా వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. అభిమానులతోపాటు.. సినీప్రముఖులు ఈ నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

రాజస్థాన్ జైపూర్ లోని ఓ రాజకోటలో డిసెంబర్ 4న కుటుంబసభ్యులు.. సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. డిసెంబర్ 2 నుంచి వివాహ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఆమె నటించిన పార్ట్ నర్, 105 మినట్స్ చిత్రాల షూటింగ్స్ కంప్లీట్ అయ్యాయి. అలాగే తెలుగులో దేశముదురు సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు.. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం తెలుగులో మైనేమ్ ఈజ్ శ్రుతి సినిమా చేస్తుండగా.. తమిళంలో నాలుగు చిత్రాలున్నాయి.

హన్సికకు కాబోయే భర్త సోహెల్ ముంబైకి చెందిన వ్యాపారవేత్త. డిసెంబర్ 2న సూఫీ రాత్రితో ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 3న మెహందీ, సంగీత్ వేడుకలు జరుగుతాయి. హన్సిక, సోహెల్‌ల హల్దీ డిసెంబర్ 4 ఉదయం జరుగుతుంది ఆ తర్వాత వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది.ఇక ఆమె వివాహం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి



మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisement

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



Related Articles

Back to top button