Entertainment

Guppedantha Manasu: గుప్పెడంత మనస్సు సీరియల్ హీరో రిషీ ఇంట తీవ్ర విషాదం..! షూటింగ్‌ మధ్యలో హుటాహుటినా..


ఆ తరువాత కన్నడ టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. ‘నాగకన్నిక’ అనే సీరియల్‌తో డెబ్యూ హీరోగా అడుగుపెట్టాడు. కన్నడ నటుడుగా తెలుగు ఇండస్ట్రీలో ప్రేమ్ నగర్ అనే సీరియల్ ద్వారా ముఖేష్ పరిచయమయ్యాడు. ఆ తరువాత గుప్పెడంత మనసు సీరియల్ తో హీరోగా ముఖేష్ తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు.

Guppedantha Manasu: గుప్పెడంత మనస్సు సీరియల్ హీరో రిషీ ఇంట తీవ్ర విషాదం..! షూటింగ్‌ మధ్యలో హుటాహుటినా..

Mukesh Gowda Father Death

Guppedantha Manasu: “గుప్పెడంత మనసు’ ఇప్పుడు ఎక్కడ ఏ నలుగురు ఆడవాళ్లు చేరినా దీని గురించిన ముచ్చట్లే. ముఖ్యంగా అమ్మాయిల ఫాలోయింగ్‌ విపరీతంగా పెరిగిపోతుంది. బుల్లితెర మీద ప్రసారమవుతున్న ఈ సీరియల్ మంచి రేటింగ్‌తో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. ఇక ఈ సీరియల్‌లో హీరో ముఖేష్‌ గౌడ్‌కు ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ మామూలుగా లేదు. ఎవరి నోట విన్న ఇప్పుడు రిషీ పేరు మారుమోగుతోంది. అది ఎంతలా అంటే బుల్లితెర నటుడు ముఖేష్ గౌడ్ అంటే జనం గుర్తుపట్టలేరు కానీ.. గుప్పెడంత మనస్సు హీరో రిషి అనగానే టక్కున ‘రిషిధారగా గుర్తుకు వచ్చేస్తాడు. కన్నడ నటుడైన తెలుగు బుల్తితెరపైకి వచ్చి సత్తా చాటుతున్నాడు. అయితే, తెరపై నవ్వుతూ తుళ్లుతూ కనిపించే రిషీ నిజ జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొంటున్నట్టుగా తెలిసిందే. ఈ క్రమంలోనే హీరో రిషి ఇంట ఇప్పుడు తీవ్ర విషాదం నెలకొంది. పక్షవాతంతో బాధ పడుతున్న రిషి తండ్రి మృతి చెందినట్లు తెలిసింది.

గత కొన్నేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్న ముఖేష్‌ గౌడ్‌(రిషి) తండ్రి ఇంటివద్దనే చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం మరింత క్షిణించి సోమవారం కన్నుమూశారని తెలిసింది. ఈ విషయం తెలిసిన ముఖేష్ గౌడ్‌.. షూటింగ్ మధ్యలోనే వెళ్లిపోయినట్లుగా తెలిసింది. కర్ణాటకకు చెందిన రిషీది చిన్న కుటుంబం. రిషికి తల్లిదండ్రులు, ఓ చెల్లి ఉన్నారు.

మోడలింగ్‌తో కెరియర్ మొదలు పెట్టిన ముఖేష్ గౌడ.. 2015లో మిస్టర్ కర్ణాటక టైటిల్ గెల్చుకున్నాడు. ఆ తరువాత కన్నడ టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. ‘నాగకన్నిక’ అనే సీరియల్‌తో డెబ్యూ హీరోగా అడుగుపెట్టాడు. కన్నడ నటుడుగా తెలుగు ఇండస్ట్రీలో ప్రేమ్ నగర్ అనే సీరియల్ ద్వారా ముఖేష్ పరిచయమయ్యాడు. ఆ తరువాత గుప్పెడంత మనసు సీరియల్ తో హీరోగా ముఖేష్ తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు.

ఇవి కూడా చదవండి

Advertisement



మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Articles

Back to top button