News

guppedantha manasu serial, Guppedantha Manasu ఆగష్టు 1: దేవయానికి రిషి వార్నింగ్.. ‘నేనేంటో చూపించాల్సి వస్తుంది’ – vasudhara is worried about rishi’s silence concerning sakshi’s marriage to him in guppedantha manasu serial today 2022 august 1 episode


గత ఎపిసోడ్‌లో సాక్షీ ఇచ్చిన షాక్‌కి అందరికీ ఫ్యూజులు ఎగిరిపోయాయి. ‘రిషి సార్‌తో నా నిశ్చితార్థం అయిపోయింది. త్వరలో మా పెళ్లి జరగనుంది’ అంటూ అందరికీ షాకిచ్చిన సాక్షీ.. రిషితో.. వసు ఇచ్చిన ప్రేమ కానుకను కూడా వదిలి పరుగులు పెట్టించింది. ఈ క్రమంలోనే నేటి కథనం ఆసక్తిగా మారింది.

517 ఎపిసోడ్‌ హైలైట్స్..
వసు రెస్టారెంట్‌కి వెళ్లిపోయి ఒంటరిగా ఏడుస్తుంటే.. సాక్షీ వచ్చి.. ‘నాదే గెలుపు.. ఆట ముగిసింది’ అంటూ పెద్దపెద్ద మాటలే మాట్లాడేస్తుంది. వసు తన బాధని కనిపించకుండా.. కవర్ చేసుకోవడానికి.. ‘నువ్వు రిషి సార్‌ని గెలవలేవు.. నువ్వే సాధించలేవు’ అని పైకి అన్నా లోపల.. రిషి ఎందుకు మౌనంగా ఉన్నాడు అనేదానికి సమాధానం దొరక్క సతమతమవుతుంది. ఇక సాక్షీ మాత్రం వసుని మాట్లాడనివ్వదు. ‘నాకు చాలా పనులు ఉన్నాయి వసు.. రిషితో లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేసుకోవాలి. త్వరలో బాగా చదువుకుని నీకు తగ్గావాడ్ని పెళ్లి చేసుకుని బతుకు అంటూ ఏదేదో మాట్లాడి వెళ్లిపోతుంది.

ఇక కాసేపటికి రిషి గురించి సాక్షీ గురించి.. మహేంద్ర, జగతి, గౌతమ్ అంతా మీటింగ్ పెట్టుకుంటారు రెస్టారెంట్‌లో వసు ముందే. కాఫీ ప్లీజ్ అంటాడు రిషి మరో బెంచ్ మీద కూర్చుని. అంతా షాక్ అవుతారు. ఇంత కూల్‌గా ఉన్నావేంటీ? అంటూ మహేంద్ర, గౌతమ్ సాక్షీ విషయం మాట్లాడే ప్రయత్నం చేస్తారు కానీ.. రిషి మాట్లాడనివ్వడు. దాంతో వసుకి ఏం అర్థం కాదు. ఇంత కూల్‌గా ఎలా ఉన్నారు సార్ అనుకుంటూ.. ఆర్డర్ తీసుకుని.. మరో అమ్మాయికి ఆ ఆర్డర్స్ అప్పగించి.. తను రెస్టారెంట్ నుంచి వెళ్లిపోతుంది. వెళ్లడం వెళ్లడమే ఎప్పుడూ వెళ్లే అమ్మవారి దగ్గరకే వెళ్లి.. తన ప్రేమ కానుకను అమ్మవారి ముందు పెట్టి.. ‘సాక్షీ చేసిన కుట్ర గురించి వివరిస్తూనే.. ‘రిషీ సార్‌కి ఏదో ఆపదొస్తుందేమో.. తనకు ఏం కాకూడదు..’ అని మొక్కుకుంటుంది. వెంటనే.. ‘రిషి సారే నా జీవితం.. ఆయన ఆనందమే నా ఆనందం.. రిషి సార్ బాగుండాలి.. నేను నిన్ను ఇంకేం కోరుకోను..’ అని దన్నం పెట్టుకుంటుంది.

ఇక రాత్రి రిషి నిద్రపోకుండా ఆలోచిస్తుంటే.. జగతి వెళ్తుంది. జగతిని చూసిన రిషి.. ‘ఇప్పుడేం మాట్లాడకండి మేడమ్.. అయినా మాట్లాడటానికి ఏముందని? మీరు కానీ వసుధార గురించో, సాక్షీ గురించి మాట్లాడటానికి వస్తే వద్దు చెబుతున్నా’ అంటాడు రిషి. ‘నేను చెప్పేది కాస్త వినండి సార్.. ఇది ఎవరి సమస్యా కాదు.. ఇది మీ సమస్య.. జీవితంలో సమస్య ఏదొక రూపంలో వస్తూనే ఉంటాయి.. వాటిని దాటుకుంటూ మనమే వెళ్లాలి.. వసుధార గురించి మీరేం చెప్పొద్దు అన్నారు కానీ.. ఒక్కటి చెప్పాలి సార్.. వసు తన విషయంలోనూ మీ విషయంలోనూ చాలా స్పష్టంగా ఉంది. తను మిమ్మల్ని ఇష్టపడుతుంది సార్..’ అంటుంది జగతి. జగతి మాటలకు రిషి షాక్ అవుతాడు. కచ్చితంగా నమ్ముతాడనే అనిపిస్తోంది.

కమింగ్ అప్‌లో..
ఇది ఇలా ఉండగా.. రేపటి ప్రోమోలో.. రిషి దేవయాని మీద ఫైర్ కావడం హైలైట్‌గా నిలిచింది. ‘సాక్షీ.. సాక్షీ.. సాక్షీ.. సాక్షీ.. ఎవరు పెద్దమ్మా ఈ సాక్షీ..? తనకి మనకీ ఏంటి సంబంధం? ఆ సాక్షీకి చెప్పండి.. ఇప్పటి దాకా తను చేసింది తప్పు.. ఇంకా ఇలాగే చేస్తే.. నేనేంటో నా ఆవేశం ఏంటో చూపించాల్సి వస్తుంది..’ అని దేవయానికే వార్నింగ్ ఇవ్వడంతో.. జగతి, మహేంద్రల ముఖాలు వెలిగిపోతున్నాయి. అదే సీన్‌లో గౌతమ్, ధరణీ కూడా ఉంటారు. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! Guppedantha Manasu కొనసాగుతోంది.

Related Articles

Back to top button