News

gujarat lift accident, 7వ అంతస్తు నుంచి కూలిన లిఫ్ట్.. ఏడుగురి మృతి – lift collapses in under construction building in ahmedabad, 7 killed


Authored by Sreenu Gangam | Samayam Telugu | Updated: Sep 15, 2022, 12:45 AM

Ahmedabad: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకొంది. ఏడో అంతస్తు నుంచి లిఫ్ట్ కుప్పకూలింది. ఏడుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. ప్రమాద సమయంలో లిఫ్ట్‌లో 8 మంది ఉన్నారు. తీవ్రంగా గాయపడిన ఎనిమిదో వ్యక్తిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న ఆ భవనంలో కూలీలను పైకి తీసుకెళ్తున్న లిఫ్ట్ 7వ అంతస్తు నుంచి ఒక్కసారిగా కిందికి పడిపోయింది. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

లిఫ్ట్ ప్రమాదం
గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో ఘోర ప్రమాదం చోటు చేసుకొంది. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో ఓ లిఫ్ట్ ఏడో అంతస్తు నుంచి కుప్పకూలింది. ఏడుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. ప్రమాద సమయంలో లిఫ్ట్‌లో 8 మంది ఉన్నారు. తీవ్రంగా గాయపడిన ఎనిమిదో వ్యక్తిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. బుధవారం (సెప్టెంబర్ 14) ఉదయం 7.30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కూలీలను పైకి తీసుకెళ్తున్న లిఫ్ట్ 7వ అంతస్తు నుంచి ఒక్కసారిగా కిందికి పడిపోయిందని అధికారులు తెలిపారు. ఆస్పైర్ -2 పేరుతో నిర్మిస్తున్న ఈ ప్రైవేట్ బిల్డింగ్.. ఓ ప్రైవేట్ డెవలపర్‌కు చెందినదని మేయర్ కేజే పార్మర్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సికింద్రాబాద్ అగ్నిప్రమాదానికి కారణమిదే.. ఫైర్ డిపార్ట్‌మెంట్ నివేదిక

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related Articles

Back to top button