News

gujarat giants, WPL :సోఫియా, హర్లీన్ బౌండరీల మోత.. బెంగళూరు టార్గెట్ 202 – sophia dunkley,harleen deol power gujarat giants to 201/7 vs rcb


ముంబయి వేదికగా జరుగుతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ -2023లో భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. బుధవారం రాత్రి బ్రబౌర్న్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ టీమ్ 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఆ జట్టులో ఓపెనర్ సోఫియా డంక్లీ (65: 28 బంతుల్లో 11×4, 3×6), హర్లీన్ డియోల్ (67: 45 బంతుల్లో 9×4, 1×6) హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. బెంగళూరు బౌలర్లు అందరూ ఓవర్‌కి 8 పరుగులపైనే సమర్పించుకోగా.. ప్రీతి బోస్ 3 ఓవర్లలోనే 47 పరుగులు ఇచ్చేసింది.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ తాత్కాలిక కెప్టెన్ స్నేహ్ రాణా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఓపెనర్ సబ్బినేని మేఘన (8: 11 బంతుల్లో 2×4) తొలి ఓవర్ మెయిడిన్ తర్వాత ఒత్తిడికి గురై తక్కువ స్కోరుకే ఔటైపోయింది. కానీ.. నెం.3లో వచ్చిన హర్లీన్ డియోల్‌తో కలిసి సోఫియా వరుస బౌండరీలతో చెలరేగిపోయింది. ఈ జంట ఓవర్‌కి 10 పరుగులు చొప్పున పరుగులు రాబట్టడంతో.. స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అయితే.. టీమ్ స్కోరు 82 వద్ద సోఫియా ఔటైపోయినా హర్లీన్ మాత్రం చివరి ఓవర్ వరకూ క్రీజులో కొనసాగింది.

హర్లీన్‌ ఒక ఎండ్‌లో నిలకడగా ఆడటంతో మరో ఎండ్‌లోని బ్యాటర్లు క్రీజులోకి వచ్చినప్పటి నుంచి హిట్టింగ్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో గార్డ్‌నర్ (19), హేమలత (16), అన్నాబెల్ (14), స్నేహ్ రాణా (2) ఔటైపోయారు. కానీ.. హర్లీన్ సమయోచితంగా హిట్ చేస్తూ గుజరాత్ స్కోరు బోర్డుని 200 దాటించింది. బెంగళూరు, గుజరాత్ జట్లు ఇప్పటికే టోర్నీలో రెండు మ్యాచ్‌లు ఆడగా.. రెండింటిలోనూ ఓడిపోయాయి. దాంతో బోణి కోసం ఈ రెండు టీమ్స్ నిరీక్షిస్తున్నాయి.

Related Articles

Back to top button