News

gujarat giants, Mumbai Indians | డబ్ల్యూపీఎల్ 2023లో అదిరిపోయిన ముంబయి బోణి.. ఫస్ట్‌లోనే గుజరాత్ బోల్తా – mumbai indians women won by 143 runs vs gujarat giants in wpl 2023


ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ -2023 (Womens Premier League 2023)లో ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) బోణి అదిరిపోయింది. గుజరాత్ జెయింట్స్‌ (Gujarat Giants)తో శనివారం రాత్రి డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ టీమ్ ఏకంగా 143 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. మొదట కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (65: 30 బంతుల్లో 14×4) మెరుపు హాఫ్ సెంచరీ నమోదు చేయడంతో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ టీమ్ 5 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో తడబడిన గుజరాత్ జెయింట్స్ టీమ్ 15.1 ఓవర్లలో 64 పరుగులకే ఆలౌటైంది.

208 పరుగుల ఛేదనలో గుజరాత్ జెయింట్స్ టీమ్ ఆరంభం నుంచే తడబడింది. కెప్టెన్ బెత్ మూనీ (0: 3 బంతుల్లో) గాయం కారణంగా ఫస్ట్‌లోనే రిటైర్ట్‌ హర్ట్‌గా వెనుదిరిగింది. కానీ.. చాలా కాన్ఫిడెంట్‌‌గా కనిపించిన ఓపెనర్ సబ్బినేని మేఘన (2: 4 బంతుల్లో) ఓ పేలవ షాట్‌తో వికెట్ చేజార్చుకోగా.. అనంతరం వచ్చిన హర్లీన్ డియోల్ (0), గార్డెనర్ (0), అన్నాబెల్ (6), గ్రేషియా (8), స్నేహ్ రాణా (1), తనూజ (0) వరుసగా పెవిలియన్‌కి క్యూ కట్టారు. దాంతో నిమిషాల్లోనే 23/7తో నిలిచిన గుజరాత్ టీమ్‌ ఓటమిని ఖాయం చేసుకుంది. అయితే.. మిడిల్ ఓవర్లలో కాసేపు వికెట్ల పతనాన్ని హేమలత (29 నాటౌట్: 23 బంతుల్లో 1×4, 2×6) అడ్డుకుంది. కానీ.. ఆమెకి మాన్షీ జోషి (6), మోనికా పటేల్ (10) నుంచి పెద్దగా సహకారం లభించలేదు.

అంతక ముందు ముంబయి జట్టులో హర్మన్‌తో పాటు ఓపెనర్ మాథ్యూస్ (47: 31 బంతుల్లో 3×4, 4×6) దూకుడుగా ఆడేసింది. అలానే కేర్ (45 నాటౌట్: 24 బంతుల్లో 6×4, 1×6) కూడా ఆఖరి వరకూ క్రీజులో ఉండి ముంబయి జట్టుకి మెరుగైన స్కోరుని అందించింది. లాస్ట్‌ బాల్‌కి క్రీజులోకి వచ్చిన వాంగ్.. సిక్స్‌తో ముంబయి ఇన్నింగ్స్‌ని ముగించడం విశేషం.

Read Latest Sports News, Cricket News, Telugu News

Related Articles

Back to top button