Tollywood: క్యూట్‌గా ముద్దుగా ఉన్న బబ్లీ గర్ల్ ఎవరో గుర్తుపట్టండి.. ఈ ముద్దుగుమ్మకు అందమే కాదు.. అదృష్టం కూడా ఎక్కువే..
పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. వరుస డిజాస్టర్స్ ఖాతాలో వేసుకుంటున్నప్పటికీ అవకాశాలు మాత్రం క్యూ కడుతూనే ఉన్నాయి. ఇంతకీ ఈ బబ్లీ గర్ల్ ఎవరో గుర్తుపట్టండి.
తెలుగు చిత్రపరిశ్రమలో తొలి సినిమాతోనే హిట్ అందుకున్న నాయికల గురించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం వెండితెరపై అలాంటి అందాల ముద్దుగుమ్మల హవానే నడుస్తోంది. కృతి శెట్టి, శ్రీలీల, ఆషికా రంగనాథ్, గౌరి కిషన్ వంటి అప్సరసలు ఇప్పుడు తెలుగులో తెగ బిజీ అయ్యారు. అలాంటి వారిలో ఈ అమ్మడు కూడా ఒకరు. సైలెంట్‌గా సందడి చేసింది. అందాలతోనే నెట్టింట అలజడి సృష్టించింది. ఫస్ట్ మూవీ అంతగా క్లిక్ అవ్వకపోయినా.. ఈ అమ్మడు నటనకు మాత్రం ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. వరుస డిజాస్టర్స్ ఖాతాలో వేసుకుంటున్నప్పటికీ అవకాశాలు మాత్రం క్యూ కడుతూనే ఉన్నాయి. ఇంతకీ ఈ బబ్లీ గర్ల్ ఎవరో గుర్తుపట్టండి.
ఈ క్యూట్ బబ్లీ గర్ల్ ఎవరంటే. హీరోయిన్ కేతిక శర్మ. 1995 డిసెంబర్ 24న ఢిల్లీలో జన్మించిన కేతిక.. ముందుగా ఈ అమ్మడు మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి.. 2016లో థగ్ లైఫ్ వీడియోతో పాపులర్ అయ్యింది. స్మాష్ వీడియోస్, మోడలింగ్, యూట్యూబ్ వీడియోలతో సోషల్ మీడియాలో క్రేజ్ దక్కించుకుంది.
ఇక 2021లో ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. అంతేకాదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి ఆహా ఓటీటీ కోసం చేసిన ప్రోమోలోనూ కనిపించింది. లక్ష్య చిత్రంలో నటించిన కేతిక చివరిసారిగా రంగ రంగ వైభవంగా సినిమాలో కనిపించింది. ఈ మూవీ అంతగా మెప్పించలేదు. కానీ కేతిక నటనకు మంచి మార్కులే పడ్డాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ బంపర్ ఆఫర్ అందుకుంది. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తోన్న ‘వినోదాయ సిథం’ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. . నటుడు, రైటర్ ఆయిన సముద్రఖని దర్శకత్వం వహించి నటించిన ఈ సినిమా అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా ఇప్పుడు తెలుగులో రీమేక్ చేయనున్నారు. ఇందులో కేతికతోపాటు.. ప్రియా ప్రకాష్ వారియర్ కూడా నటించనుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి