Entertainment

Tollywood: ఈ మలయాళీ కుట్టి ఎవరో గుర్తుపట్టగలరా ?.. రవితేజ సరసన నటించి హృదయాలను దొచేసింది..


పైన ఫోటోలో ఉన్న ఆ అందాల ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టగలరా ?.. ఈ మలయాళీ కుట్టికి సౌత్ ఇండియాలో మంచి ఫాలోయింగ్ ఉందండి. తెలుగులో చేసింది ఒక్క సినిమా అయినా.. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి ఫాలోయింగ్ ఏర్పర్చుకుంది. తమిళం, మలయాళంలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. ఎవరో గుర్తుపట్టారా ?..

పైన ఫోటోలో ఉన్న ఆ అందాల ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టగలరా ?.. ఈ మలయాళీ కుట్టికి సౌత్ ఇండియాలో మంచి ఫాలోయింగ్ ఉందండి. తెలుగులో చేసింది ఒక్క సినిమా అయినా.. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి ఫాలోయింగ్ ఏర్పర్చుకుంది. తమిళం, మలయాళంలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. ఎవరో గుర్తుపట్టారా ?.. తనే రామారావు ఆన్ డ్యూటీ ఫేమ్ రజిషా విజయన్. 1991 జూలై 15లో కేరళ రాష్ట్రం, కోళికోడు జిల్లా, కాలికట్ లో జన్మించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాలోని అమిటీ యూనివర్సిటీ నుంచి మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో డీగ్రీ పూర్తి చేసింది. 2016లో మలయాళ సినిమా ‘అనురాగ కరిక్కిన్ వెల్లం’ అనే సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది.

‘అనురాగ కరిక్కిన్ వెల్లం’ సినిమాలోని ఆమె నటనకుగాను ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును అందుకుంది. అలాగే తమిళ్ స్టార్ సూర్య నటించిన ‘జై భీమ్” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పలకరించింది ఈ బ్యూటీ. ఆ తర్వాత ధనుష్ తో కలిసి కర్ణన్ సినిమాలో నటించి మెప్పించింది. మలయాళంలో క్రేజీ హీరోయిన్ గా రాణిస్తున్న ముద్దుగుమ్మల్లో రజిషా విజయన్ ఒకరు.

ధనుష్ తో కలిసి కర్ణన్ సినిమాలో నటించి మెప్పించింది రజిషా. ప్రస్తుతం మలయాళ తమిళ భాషల్లో వరుస అవకాశాలు అందుకుంటున్న ఈ బ్యూటీ.. రవితేజ నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తెలుగులో నటించాలనే కోరిక మొదట్నుంచీ ఉందని.. తగిన కథ కోసం అలాగే మరిన్ని ఎదురు చూస్తోంది.

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement



Related Articles

Back to top button