Entertainment

Tollywood: మాస్క్ మాటున దాక్కొని.. చురకత్తుల చూపుతో తికమకపెడుతున్న ఈ భామ ఎవరో కనిపెట్టగలరా..?


అందం అభినయం వీటితో పటు అదృష్టం అన్ని కలబోసిన ముద్దుగుమ్మ ఈ భామ. టాలీవుడ్ , బాలీవుడ్ , కోలీవుడ్ అంటూ అన్ని ఇండస్ట్రీలను చుట్టేస్తోంది.

అందం అభినయం వీటితో పటు అదృష్టం అన్ని కలబోసిన ముద్దుగుమ్మ ఈ భామ. టాలీవుడ్ , బాలీవుడ్ , కోలీవుడ్ అంటూ అన్ని ఇండస్ట్రీలను చుట్టేస్తోంది. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది. ఇంతకు పై ఫొటోలో ఉన్న భామ ఎవరో గుర్తుపట్టారా..? చూడచక్కని మోమును దాచేసిన ఈ ముద్దుగుమ్మ కుర్రాళ్ల కలల రాకుమారి. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ సేట్ఠస్ ను అందుకుంది ఇంతకు ఈ భామ ఎవరై ఉంటారు.? చెప్పుకోండి చూద్దాం..?

దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించింది ఈ చిన్నది. అయితే గతకొంతకాలంగా ఈ చిన్నదాని సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. అయినా ఆఫర్స్ కు మాత్రం ఏం కొదవలేదు. ఇప్పటికైనా కనిపెట్టరా ఈ హీరోయిన్ ఎవరో.. ఆమె మరెవరో కాదు. అందాల భామ పూజాహెగ్డే.

ఒక లైలా కోసం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఆ తర్వాత వరుణ్ తేజ్ నటించిన ముకుంద సినిమాలో చేసింది. ఈ రెండు సినిమాల్లో పద్దతిగా కనిపించిన పూజా అల్లు అర్జున్ డీజే సినిమాలో ఏకంగా బికినిలో కనిపించి షాక్ ఇచ్చింది.

అమ్మడి అందానికి ప్రేక్షకులు నోరెళ్లబెట్టారు. ఆ తర్వాత పూజా వరుస ఆఫర్స్ తో టాలీవుడ్ లో రాణిస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఇలా మాస్క్ పెట్టుకొని ఫోటోలను షేర్ చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement



Related Articles

Back to top button