Tollywood: సముద్ర తీరాన అందాల రాశి.. నెట్టింట ఈ ముద్దుగుమ్మ ఫాలోయింగ్ చూస్తే మతిపోవాల్సిందే..
హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఎవరో గుర్తుపట్టండి.
అందం, అభినయంతో పాన్ ఇండియా సినీ ప్రియులను అలరిస్తోంది ఓ ముద్దుగుమ్మ. సెలబ్రెటీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చినా.. కష్టాన్నే నమ్ముకుంది. గ్లామర్ షోస్ మాత్రమే కాకుండా కంటెంట్.. తన పాత్ర ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని సినిమాలను ఎంచుకుంటుంది. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఎవరో గుర్తుపట్టండి. పైన ఫోటోలో ఉన్న ఆ అమ్మడు.. చేసింది ఆరు సినిమాలే అయిన సూపర్ హిట్ అందుకోవడమే కాదు.. నటనకు ప్రశంసలు కూడా అందుకుంది. ఎవరో గుర్తుపట్టారా ? తను అతిలోక సుందరి తనయ శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్.
దివంగత హీరోయిన్ శ్రీదేవి.. ప్రొడ్యూసర్ బోనీ కపూర్ దంపతుల వారసురాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2018లో ధడక్ సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసింది. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక తర్వాత జాన్వీ నటించిన చిత్రాలన్ని ప్రేక్షకులను ఆకట్టుకోగా.. వసూళ్ల పరంగా కాస్త వెనకపడ్డాయి.
అయితే హిట్టు ప్లాపు అనే సంబంధం లేకుండా కంటెంట్ నచ్చితే విభిన్న చిత్రాలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి చెప్పుక్కర్లేదు. జాన్వీకి ఇన్ స్టాలో దాదాపు 21.2 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. సినిమాల్లో ఎప్పుడూ ఢీగ్లామర్ షోస్ ఎంచుకుంటూ నటన పరంగా మార్కులు కొట్టేసే జాన్వీ నెట్టింట మాత్రం గ్లామర్ షోతో రచ్చ చేస్తుంటుంది. ఇక తాజాగా జాన్వీ తెలుగు తెరపై సందడి చేయబోతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో రాబోతున్న ntr 30లో జాన్వీ నటిస్తోంది. మార్చి 6న జాన్వీ పుట్టినరోజు కావడంతో ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి