Tollywood: ఈ రెండు జళ్ల సీత.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టండి..
తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసింది. అతి తక్కువ సమయంలో స్టార్ డమ్ అందుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది. బాలీవుడ్ లో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ.. అక్కడే సెటిల్ అయ్యింది.
పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని గుర్తు పట్టారా..? ఎక్కడో చూసినట్లే ఉంది కదా.. మీరు ఊహించిన పేరు కరెక్టే. ఆ చిన్నారి టాలీవుడ్ స్టార్ హీరోయిన్. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసింది. అతి తక్కువ సమయంలో స్టార్ డమ్ అందుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది. బాలీవుడ్ లో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ.. అక్కడే సెటిల్ అయ్యింది. ఇటీవల ఈ ముద్దుగుమ్మ వివాదాల్లో ఎక్కువగానే చిక్కుకుంటుంది. గతంలో సౌత్ ఇండస్ట్రీపై ఈ అమ్మడు చేసిన కామెంట్స్ తో ట్రోలింగ్ ఎదుర్కొంది. తనెవరో కాదు.. తాప్సీ పన్నూ. మంచు మనోజ్ నటించిన ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యింది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
ఆ తర్వాత మిస్టర్ ఫర్ఫెక్ట్, వీర, దరువు, మొగుడు, గుండెల్లో గోదారి చిత్రాల్లో నటించింది. ఛష్మే బద్దూర్ సినిమాతో హిందీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్ కు మాకాం మార్చిన తాప్సీ అక్కడ మంచి విజయాలు సాధించింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా గడుపుతోంది. బాలీవుడ్‌లో ఫిమేల్ సెంట్రిక్, బయోపిక్స్ చేస్తూ ముంబైలో సెటిల్ అయ్యింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేసింది తాప్సీ.
మొన్నటి వరకు బాలీవుడ్ లో కూడా వరుస విజయాలు సొంతం చేసుకున్న తాప్సి మళ్లీ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. విభిన్నమైన సినిమాలు చేసినప్పటికీ కూడా ఆమెకు పెద్దగా విజయాలు రావడం లేదు. అలాగే కమర్షియల్ సినిమాలు కూడా చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది తాప్సీ. తాజాగా ఆమెకు సంబంధించిన చైల్డ్ హుడ్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి