Entertainment

Tollywood: ఈ ఫోటోలోని చిన్నారి పవన్ కళ్యాణ్, ప్రభాస్‏ల సరసన నటించింది.. ఈ క్రేజీ బ్యూటీని గుర్తుపట్టండి..


ఇటీవల త్రోబ్యాక్ ట్రెండ్ లో భాగంగా కొద్ది రోజులుగా నెట్టింట సెలబ్రెటీల చైల్డ్ హుడ్ ఫోటోస్ చక్కర్లు కొడుతుండగా.. ఆ జాబితాలోకి మరో హీరోయిన్ పిక్ చేరింది. పైన ఫోటోను చూశారు కదా.. ఆ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయిని మీరు గుర్తుపట్టారా ?..

టాలీవుడ్‌లో తమ నటనతో స్టార్ డమ్ సంపాదించుకున్న నటీమణులు చాలా మంది ఉన్నారు. తెలుగు చిత్రపరిశ్రమలోని నటీమణులు తమ నటనతోనే కాకుండా అందంతోనూ అభిమానులను సొంతం చేసుకున్నారు. ఒకప్పుడు స్టార్స్ గా వెలిగిన ముద్దుగుమ్మలు పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అగ్ర హీరోలందరి సరసన నటించి మెప్పించిన ముద్దుగుమ్మలు ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. తమ ఫ్యామిలీ ఫోటోస్ మాత్రమే కాదు.. తమ చిన్ననాటి జ్ఞాపకాలను కూడా పంచుకుంటున్నారు. ఇటీవల త్రోబ్యాక్ ట్రెండ్ లో భాగంగా కొద్ది రోజులుగా నెట్టింట సెలబ్రెటీల చైల్డ్ హుడ్ ఫోటోస్ చక్కర్లు కొడుతుండగా.. ఆ జాబితాలోకి మరో హీరోయిన్ పిక్ చేరింది. పైన ఫోటోను చూశారు కదా.. ఆ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయిని మీరు గుర్తుపట్టారా ?.. తనే హీరోయిన్ ఆసిన్.

సౌత్ టూ నార్త్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఆసిన్. 15 ఏళ్ల వయసులో సినీరంగ ప్రవేశం చేసింది ఆసిన్. చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ .. ఆ తర్వాత కథానాయికగా మెప్పించింది. 2004లో తమిళ్ స్టార్ జయం రవితో సన్ ఆఫ్ మహాలక్ష్మి చిత్రంలో కనిపించింది.

ఆసిన్.. తమిళ్ స్టార్ సూర్య కాంబోలో వచ్చిన గజిని చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. ఈ మూవీతో కోలీవుడ్ మాత్రమే కాదు.. టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సరసన అన్నవరం, ప్రభాస్ తో చక్రం సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటున్న సమయంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్, సల్మాన్, అమీర్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. 2016లో టెక్ కంపెనీ మైక్రోమ్యాక్స్ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మను వివాహం చేసుకుంది ఆసిన్. వీరికి ఓ పాప ఉంది. ప్రస్తుతం ఆసిన్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement



Related Articles

Back to top button