Tollywood: ఈ ఫోటోలో పాన్ ఇండియా క్రేజీ హీరోయిన్ ఉంది.. ఎవరో గుర్తుపట్టారా ?..
ఐదు పదుల వయసుకు చేరువవుతున్న ఇప్పటికీ తరగని అందంతో అభిమానులను కట్టిపడేస్తుంది. ఇప్పటివరకు వెండితెరపై అలరించిన ఈ హీరోయిన్.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో బుల్లితెరపై సత్తా చాటుతుంది. ఎవరో గుర్తుపట్టండి.
ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ గురించి చెప్పక్కర్లేదు. స్టార్ హీరోస్ సరసన స్క్రీన్ షేర్ చేసుకుని అగ్రకథానాయికలుగా ఓ వెలుగు వెలిగి.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ సత్తా చాటుతున్నారు. అలాంటివారిలో ఈ హీరోయిన్ కూడా ఒకరు. పైన ఫోటోను చూశారు కదా.. అందులో పాన్ ఇండియా క్రేజీ హీరోయిన్ ఉంది. తెలుగుతోపాటు..హిందీలోనూ పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగులో ఒక్క సినిమాతోనే ఆడియన్స్ మది దొచుకుంది. ఐదు పదుల వయసుకు చేరువవుతున్న ఇప్పటికీ తరగని అందంతో అభిమానులను కట్టిపడేస్తుంది. ఇప్పటివరకు వెండితెరపై అలరించిన ఈ హీరోయిన్.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో బుల్లితెరపై సత్తా చాటుతుంది. ఎవరో గుర్తుపట్టండి.
ఆ అమ్మాయిల్లో ఉన్న హీరోయిన్ ఎవరో కాదండి.. బాలీవుడ్ బ్యూటీ.. టాలీవుడ్ సాగరకన్య శిల్పా శెట్టి. 1993లో బాజీగర్ సినిమాతో తెరంగేట్రం చేసింది శిల్పా. ఆ తర్వాత హిందీ, కన్నడ, తెలుగు ఇండస్ట్రీలలో దాదాపు 40 సినిమాలకు పైగా నటించారు. 1975 జూలై 8న ఓ సాంప్రదాయ కుటుంబంలో జన్మించింది.
తెలుగులో వెంకటేశ్ సరసన సాహసవీరుడు సాగరకన్య సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది.ఆ తర్వాత నాగార్జునకు జోడిగా ఆజాద్, భలేవాడివి బసూ చిత్రాల్లో నటించింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన శిల్పా.. ప్రస్తుతం హిందీలో బుల్లితెరపై పలు రియాల్టీ షోలకు జడ్జీగా వ్యవహరిస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి