Entertainment

Guess The Actress : అమాయకపు చూపుల ఈ క్యూటీ.. ఇప్పుడు కుర్రాళ్ల కలల రాకుమారి.. తెలుగులో ఫాలోయింగ్ ఎక్కువే ఉంది.. గుర్తుపట్టండి..


Actress

గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ఫోటోస్ వైరలవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా స్టార్ హీరోహీరోయిన్స్ చిన్ననాటి పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తమ అరుదైన ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటున్నారు. ఈ త్రోబ్యాక్ ఫోటోస్ ట్రెండ్ పై నెటిజన్స్ సైతం ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా మరో క్యూటీ పిక్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. ఈ లిటిల్ ప్రెన్సెస్ ఎవరో గుర్తుపట్టండి. అమాయకపు చూపులతో కట్టిపడేస్తున్న ఈ బుజ్జాయికి తెలుగులో యమ ఫాలోయింగ్ ఉంది. అలాగే.. అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా ? అందం, టాలెంట్ ఉన్నా ఈ ముద్దుగుమ్మకు మాత్రం అంతగా అవకాశాలు రావడం లేదు. ఇటీవల ఎన్నో అంచనాలతో విడుదలైన సినిమా కూడా నిరాశ పరిచింది. ఎవరో గుర్తుపట్టండి. మీకోసం మరో క్లూ. అక్టోబర్ 28న ఈ చిన్నారి పుట్టినరోజు. ఈ సందర్భంగా యంగ్ హీరో తన ఫోటో షేర్ చేస్తూ విషెస్ అందించాడు.

గుర్తుపట్టారా ?.. తను ఎవరో కాదండి.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అదిథి రావ్ హైదరీ. సమ్మోహనం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత వీ, అంతరిక్షం చిత్రాల్లో అలరించింది. చివరిసారిగా అదితి మహా సముద్రం చిత్రంలో నటించింది. ఇందులో శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రలలో నటించారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను ఆశించిన స్తాయిలో ఆకట్టుకోలేక పోయింది.

 

View this post on Instagram

 

A post shared by Aditi Rao Hydari (@aditiraohydari)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Advertisement

Related Articles

Back to top button