Entertainment

Tollywood: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎత్తుకున్న ఆ చిన్నోడు ఎవరో గుర్తుపట్టరా ?.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో..


మెగా ఫ్యామిలీ అరుదైన పిక్స్ చూసేందుకు ..తెలుసుకోవడానికి నెటిజన్స్ సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సమయంలో పవన్, చిరు, నాగబాబు కలిసున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. అందులో ఉన్న చిన్నోడు ఎవరో గుర్తుపట్టండి.

మెగా ఫ్యామిలీ అంటే ఇండస్ట్రీలో ప్రత్యేకస్థానం. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా నటుడిగా ఎంట్రీ ఇచ్చి మెగాస్టార్ అయ్యారు చిరంజీవి కొణిదెల. స్వయం కృషితో హీరోగా ఎదిగిన చిరు.. ఎంతో మంది నటీనటులకు ఆదర్శం. చిరు తర్వాత అంతటి స్టార్ డమ్ అందుకున్న పవన్ కళ్యాణ్. మెగాస్టార్ తర్వాత పవర్ స్టార్‏గా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు చిత్రపరిశ్రమలో మెగా ఫ్యామిలీ నుంచి హీరోలుగా అరంగేట్రం చేసి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు యంగ్ హీరోస్. ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా క్రేజ్ అందుకున్నారు. ఇక సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్ సరైన హిట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక వీరంతా నెట్టింట చేసే సందడి గురించి చెప్పక్కర్లేదు. ఫ్యామిలీతో గడిపిన చిన్ననాటి జ్ఞాపకాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. పవన్, చిరుతో కలిసి ఉన్న అప్పటి జ్ఞాపకాలను పంచుకుంటుంటారు. అలాగే మెగా ఫ్యామిలీ అరుదైన పిక్స్ చూసేందుకు ..తెలుసుకోవడానికి నెటిజన్స్ సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సమయంలో పవన్, చిరు, నాగబాబు కలిసున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. అందులో ఉన్న చిన్నోడు ఎవరో గుర్తుపట్టండి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎత్తుకున్న ఈ చిన్నోడు ఎవరో గుర్తుపట్టండి. మెగాస్టార్ చిరంజీవి.. నాగబాబు.. పవన్ కళ్యాణ్ మధ్యలో సరదాగా కూర్చున్న ఈ చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్ హీరో. కటౌట్‏లో తిరుగే లేదు. అంతేకాకుండా అమ్మాయిల ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఇంతకీ ఎవరా హీరో అనుకుంటున్నారా ?. ఆ చిన్నోడు మరెవరో కాదండి. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు హీరో వరుణ్ తేజ్. ముకుంద సినిమాతో హీరోగా పరిచయమైన వరుణ్.. కంచె చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించారు.

ఇదిలా ఉంటే.. త్వరలోనే మెగా ఇంట పెళ్లి బజాలు మోగబోతున్నాయి. అతి త్వరలోనే వరుణ్ తేజ్ పెళ్లి ప్రకటన రాబోతున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు నాగబాబు. తన మ్యారెజ్ కు సంబంధించిన అన్ని వివరాలను స్వయంగా వరుణ్ ప్రకటిస్తాడని తెలిపారు. అయితే కాబోయే కోడలి గురించి మాత్రం ఎలాంటి విషయాలు బయటపెట్టలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement



Related Articles

Back to top button