News

gudivada amarnath, పవన్ కళ్యాణ్‌కు పంపబోయిన లేఖను నాకు పంపారా.. హరిరామ జోగయ్యకు మంత్రి అమర్నాథ్ కౌంటర్ – minister gudivada amarnath counter to chegondi harirama jogaiah


కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్యకు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఘుటుగా కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు మంత్రి అమర్నాథ్ ఆదివారం ట్విట్టర్‌లో లేఖ పోస్ట్ చేశారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో జతకడుతున్న పవన్ కళ్యాణ్‌కు పంపబోయిన లేఖను తనకు పంపారా? అని హరిరామ జోగయ్యకు చురకలంటించారు. అలాగే హరిరామ జోగయ్యకు ఆయురారోగ్యాలతో పాటు మానసిక దృఢత్వంతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.


అంతకు ముందు మంత్రి అమర్నాథ్‌పై మాజీ మంత్రి హరిరామ జోగయ్య తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు మంత్రి అమర్నాథ్‌కు ఆదివారం హరిరామ జోగయ్య లేఖ రాశారు. ‘‘డియర్ అమర్‌నాథ్.. నువ్వు రాజకీయాల్లో బచ్చావి.. పైకి రావాల్సిన వాడివి.. సాధారణ మంత్రి పదవికి అమ్ముడు పోయి కాపుల భవిష్యత్తుని పడు చేయకు. అనవసరంగా పవన్ కళ్యాణ్‌పై బురద చల్లడానికి ప్రయత్నం చేయకు. నీ భవిష్యత్ కోరి చెబుతున్నా.’’ అంటూ హరిరామజోగయ్య పేర్కొన్నారు. దీంతో హరిరామ జోగయ్యకు మంత్రి అమర్నాథ్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు.

అమర్నాథ్.. రాజకీయాల్లో నువ్వు బచ్చావి: హరిరామ జోగయ్య

Related Articles

Back to top button