News
GT vs CSK క్వాలిఫయర్ -1 మ్యాచ్ విజేతపై హర్భజన్ సింగ్ జోస్యం – harbhajan singh picks csk as favourite in ipl 2023 qualifier 1
ఈరోజు మ్యాచ్‌లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? అనే ప్రశ్నకి భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సమాధానమిస్తూ ‘‘చెన్నై, గుజరాత్ మధ్య ఈరోజు మ్యాచ్ చాలా పోటాపోటీగా ఉండబోతోంది. ఎందుకంటే రెండు జట్లకీ పెద్ద మ్యాచ్‌ల్లో ఎలా గెలవాలో బాగా తెలుసు. కానీ.. సొంతగడ్డపై ఆడబోతుండటం చెన్నైకి లబ్ధి చేకూర్చనుంది. వాళ్లకి అక్కడి పిచ్, వాతావరణ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంది. కానీ ఈ ఏడాది సొంతగడ్డపై చెన్నై పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయించలేకపోయింది. అయినప్పటికీ ప్లేఆఫ్స్‌లో చెన్నై చాలా భిన్నమైన జట్టుగా కనిపిస్తుంది. కాబట్టి మ్యాచ్‌లో చెన్నై గెలిచే అవకాశం ఉంది’’ అని అభిప్రాయపడ్డాడు.
రెండు జట్లు బలాబలాల పరంగా చూసుకుంటే మంచి సమతూకంతో కనిపిస్తున్నాయి. గుజరాత్ టీమ్‌లో ఓపెనర్ శుభమన్ గిల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. మరోవైపు చెన్నై టీమ్‌లో ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, దేవాన్ కాన్వె మంచి టచ్‌లో కనిపిస్తున్నారు. అలానే బౌలింగ్ విభాగం కూడా రెండు జట్లలోనూ పటిష్టంగా ఉంది.