News
green india challenge, ‘పిల్లల్ని పెంచిన చేతులు మొక్కల్ని పెంచితే ప్రకృతి పరవశించిపోతుంది’ – hyderabad mayor gadwal vijayalaxmi about green india challenge on womens day
స్త్రీలు శక్తిస్వరూపులని.. వారు తాము తలపెట్టిన అన్ని కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేయగలరని మేయర్ తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉమెన్స్ డే ప్రత్యేక కార్యక్రమంలో ప్రతి మహిళ, విద్యార్థిని పాల్గొనేలా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూనే.. పుడమి బాగుకోసం అలుపెరగక కృషి చేస్తున్నారని తెలిపారు.
సాలుమారద తిమ్మక్కగారి స్పూర్తితో ప్రతి మహిళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మొక్కను నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం తరువాతి తరాల బాగు కోసం తలపెట్టిన నిస్వార్థమైన కార్యక్రమం అని కొనియాడారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మంచి ఆశయంలో ప్రతి మహిళా భాగస్వామి కావాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు.
- Read More Telangana News And Telugu News